ఎప్రిల్ ఫ‌స్ట్ ఫూల్స్ డే వచ్చిందంటే వింత వింత చేస్ట‌లు చేస్తూ ఇత‌రుల‌ను ఫూల్స్ ను చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అలా ఫూల్స్ చేసే క్ర‌మంలో ఎంత‌టి వెర్రి ప‌ని అయినా చేయ‌డానికి వెన‌కాడ‌రు. అయితే అలా వెర్రిప‌నులు చేసిన‌ప్పుడు కొన్ని ప్ర‌మాదాలు కూడా చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ కుర్రాడు స్నేహితుల‌ను ఫూల్స్ ను చేద్దామ‌నుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెలితే...కేర‌ళ‌లోని అల‌ప్పూడి జిల్లాలోని త‌ల‌వాడి ప్రాంతంలో నివాసం ఉండే సిద్ధార్థ్ అజ‌య్ 17 అనే కుర్రాడు. ఎప్రిల్ 1న ఫూల్స్ డే సందర్భంగా త‌న స్నేహితుల‌ను ఫూల్స్ చేయాల‌ని అనుకున్నాడు. ఖ‌చ్చింతంగా వారు న‌మ్మేలా ఎదైనా చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. దాని కోసం ఎన్నో ప్లాన్ లు వేసుకున్నాడు. ఆ టైమ్ లో ఓ ద‌రిద్ర‌మైన ఐడియా అజ‌య్ కి తట్టింది.

ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు న‌టిస్తే ఫ్రెండ్స్ క‌చ్చితంగా న‌మ్ముతారని అనుకున్నాడు. వెంట‌నే త‌న గ‌దిలోకి వెళ్లి త‌న ఫోన్ లో ఫేస్ బుక్ లైవ్ ఆన్ చేశాడు. అనంత‌రం బెడ్ షీట్ ను తీసుకుని ఫ్యాన్ కు క‌ట్టాడు. దాన్ని త‌న మొడ‌కు చుట్టుకున్నాడు. అయితే ప్ర‌మాద‌వ‌శాత్తు అత‌డి మెడ‌కు బెడ్ షీట్ బిగుసుకుపోయింది. అదే స‌మ‌యంలో అత‌డి త‌ల్లి గ‌దిలోకి వ‌చ్చి షాక్ అయ్యింది. కొడుకు ఫ్యాన్ కు వేళాడుతూ కనిపించ‌డంతో వెంట‌నే బోరున విల‌పించి పొరుగువాళ్ల‌న‌ను పిలిచింది. వారి సహాయంతో ఫ్యాన్ కు వేళాడుతున్న అజ‌య్ ను క్రింద‌కు దించి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆస్ప‌త్రికి వెళ్లిన వెంట‌నే వైద్యులు అప్ప‌టికే కుర్రాడు మ‌ర‌ణించిన‌ట్టు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ మొద‌లు పెట్టారు. ఈ విచార‌ణ‌లో భాగంగా కుర్రాడి ఫోన్ తీసుకుని చూడ‌గా  అప్ప‌టికి కూడా అత‌డి ఫేస్ బుక్ లైవ్ కొన‌సాగుతుండ‌టం చూసి షాక్ అయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: