కామాంధుల కోరికలు తీర్చుకోవడం కోసం ఎంత దారుణాలకైన ఒడిగడుతున్నారు. వావి వరసలు మరచి క్షణ కాల సుఖం కోసం నీచానికీ దిగజారుతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి. తండ్రి కూతురు పై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. మరో వైపు కొడుకు తల్లిపై అత్యాచారాలు చేస్తున్నారు. వారి కోరిక తీరకుంటే అవతలి వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు జరిగిన ఓ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. సొంత అన్ననే చెల్లి పై లైంగిక వేధింపులకు గురి చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


వివరాల్లోకి వెళితే.. సభ్యసమాజం తలదించుకునే ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా యువతిపై తోడబుట్టిన సోదరులే బలవంతంగా లైంగిక దాడి కి పాల్పడుతున్నారు. అయితే సోదరులు ఇలా తనపై అత్యాచారానికి ఒడిగడుతున్నారని తల్లికి చెప్పినా ఆమె పట్టించుకోలేదు. అంతేగాక నిందితులకు తన తల్లి, పెద్దమ్మ కూడా సహకరించారు. అతని ఆగడాలు ఎక్కువ కావడంతో తట్టుకోలేక పోయిన యువతి పోలీసులను ఆశ్రయించారు.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్‌లో సొంత చెల్లి పై అన్నతోపాటు పెద్దమ్మ కొడుకు బలవంతంగా లైంగిక దాడి చేశారు. గత కొన్ని నెలల నుంచి చెల్లిని చిత్రహింసలు పెడుతూ వచ్చారు. అన్నలు ఇబ్బందులు పెడుతున్న విషయం మా అమ్మకు, పెద్దమ్మ, పెద్దనాన్నకు చెప్పానని, అయిన వారు పట్టించుకోకపోగా వారికే సపోర్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. పోలిస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేస్తానని చెప్పినప్పుడల్లా తనను చంపుతానని బెదిరించేవారని దీంతో పోలీసులకు చెప్పలేకపోయానని వాపోయింది. తన తండ్రి లేక పోవడతో అలుసుగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడుతున్నారని చెప్పుకోచ్చింది... అయితే, ఈ ఘటన ఆ నోటా ఈ నోటా పాకి వైరల్ అయ్యింది. దీంతో నిందితుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: