పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో సంఘటన జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామానికి చెందిన మధునక్క, శంకర్ దంపతుల కుమారుడు మహేశ్ డిగ్రీ చదువుతున్నాడు. తన కుటుంబ పరిస్థతి మంచిగలేక అతడు ఉద్యోగం చేయాల్సి వచ్చింది. చదువును మధ్యలో మానేయకుండా చదువుకుంటూనే ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.
ఇక మంచిర్యాలలోని చున్నంబట్టి వాడకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. రెండేళ్లపాటు ప్రేమించుకున్నారు. ఇటీవల మహేశ్ తన ప్రేయసి ఇంటికి వెళ్లి మనం పెళ్లి చేసుకుందాం.. అని తెలపగా.. దానికి యువతి నిరాకరించింది. పోలీసులను ఆశ్రయించి తనకు మహేశ్‌తో పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెందిన మహేశ్ కాన్కూర్ గ్రామ సమీపంలో పురుగుల మందు తాగాడు .
అతడిని గమనించిన స్థానికులు మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాలని వైద్యులు తెలిపారు. వెంటనే అతడిని కుటుంబసబ్యులు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, తాను ప్రేమించిన అమ్మాయి సుఖంగా ఉండాలన్ని మహేశ్ రాసిన సూసైడ్‌నోట్ లభించింది. కుటుబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.