అమ్మాయిల పై అఘాయిత్యాలు, దాడులు, హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మనుసులు రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మహిళలను అంతకు మించి నరకాన్ని చూసేలా చేస్తున్నారు. ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలను అమలు చేస్తున్నారు. అంతేకాదు, కొత్త శిక్షలను అమలు చేస్తున్నారు. అయినా సమాజంలో ఎటువంటి మార్పులు రాలేదు.. వావి వరుసలు లేకుండా మహిళల పై దాడులు చేస్తూనే ఉన్నారు. ఆఖరికి పొత్తిళ్ళ లో ఉండే పసికందును కూడా వదల్లేదు.. ఇలాంటి మృగాలను శిక్షించిన కూడా పాపం చుట్టుకుంటుంది.. ఇప్పుడు వెలుగు చుసిన ఘటన అత్యంత భాధాకర మైన ఘటన ఇది. వింటే కన్నీళ్లు రాక మానదు.

అభం,శుభం తెలియని  మాటలు రాణి ఓ మూగ పిల్ల పై ఇద్దరు కామాంధులు పశు వాంఛన తీర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం ఏజెన్సీ లోని జి.మాడుగుల మండలం పెదలోచలి గ్రామం లో జరిగిన ఈ సంఘటన ఆలస్యం గా వెలుగు చూసింది. పెదలోచలి లో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న మూగ బాలిక  ఏప్రిల్‌ 29న గన్నేరు పుట్టులో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లేందుకు ఆటో ఎక్కింది. భయపడుతూనే ఉన్న విషయాన్నీ ఆటో డ్రైవర్ గమనించాడు.


బాలిక ఒక్కతే ఉండడంతో డ్రైవర్‌ ఎన్‌. ఏడుకొండలు ,అతని స్నేహితుడు పి. బాబూరావు ఆటోను దారి మళ్లించారు.నిర్మానుష్యం గా ఉన్న మద్దుల బంద మార్గం లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలి ని అక్కడ వదిలేసి వెళ్లి పోయారు. దీంతో మరో ఆటోలో బాలిక తల్లి వద్దకు చేరుకుంది. మరుసటి రోజు తనకు జరిగిన అన్యాయాన్ని తల్లికి సైగల తో వివరించింది. దీంతో ఆమె స్థానికుల తో కలిసి జి. మాడుగుల పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. బాధితురాలి వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: