పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మజీద్‌నగర్ ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల బాలికకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు మే 27వ తేదీన కేర్ నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. అయితే వార్డు బాయ్ తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తనకు డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేసినట్టు బాలిక ఆరోపించారు. అలాగే ఈ విషయం ఎవరికైనా చెబితే పాయిజన్ ఇంజక్షన్ ఇస్తానని బెదిరింపులకు దిగినట్టుగా తెలిపింది.
అయితే వార్డు బాయ్ బెదిరింపులకు భయపడిపోయిన యువతి తీవ్ర మనోవేదన అనుభవించింది. అయితే ధైర్యం తెచ్చుకుని ఈ విషయాన్ని ఆమె తన సోదరుడి భార్యకు వివరించి.. కన్నీరు పెట్టుకుంది. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులు లిసారీ గేట్ పోలీస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించి ఫిర్యాదు చేశారు.
ఇక మరోవైపు ఈ ఘటన గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలిపిన తర్వాత.. ఆమె కజిన్ ఒకరు ఆస్పత్రి వద్దకు వెళ్లారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో నిందితుడు తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో పేషెంట్‌ను వేధిస్తున్నట్టుగా ఉంది. ఆ తర్వాత అనుమానం కలిగించే విధంగా సీసీటీవీ కెమెరాలు 40 నిమిషాల్ ఆఫ్ చేయబడ్డాయి. ఈ క్రమంలో నేరం బయటపడకుండా ఉండేందుకు నిందితుడే సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేయించి ఉంటాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
కాగా.. పోలీసులు నిందితుడిని ఖార్ఖౌడాలోని ఘోసిపూర్ గ్రామానికి చెందిన ఖాసీమ్‌గా గుర్తించారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నించారు. మరోవైపు ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి స్థానిక ఎస్‌హెచ్‌వో ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి కుటుంబం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐని తప్పుదోవ పట్టించాడనే ఆరోపణలు ఉన్నాయి.