పూర్తి వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్ లోని ఓ మారుమూల పల్లెలో తల్లిదండ్రులతో పాటు ఓ కుమారుడు నివాసం ఉంటున్నాడు. ఇక లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోవడంతో గుజరాత్ కు వెళ్లి పని చేస్తున్నారు. దాంతో ఆమె గత కొన్ని రోజులుగా ఒంటరిగా జీవనం సాగిస్తుంది. ఇక ఓ రోజు ఆమె నిద్రిస్తున్న సమయంలో ఇంటి తలుపు ఎవరో కొట్టారు. అయితే రాత్రి 11 గంటల ప్రాంతంలో తలుపు శబ్ధం కావడంతో ఆమె భయభ్రాంతులకు గురైంది.
ఇక ఇంత రాత్రి నాకోసం ఎవరు వచ్చి ఉంటారా.. అని భయంతో మంచం మీద నుంచి వెళ్లి తలుపు తెరిచింది. అయితే తలుపు కొట్టింది పొరిగింట్లో ఉండే ఇద్దరు అన్నదమ్ముళ్లు. వారిద్దరూ ఆమెకు బాగా తెలిసిన వ్యక్తులు. దాంతో ఆమె కొంచెం దైర్యం తెచ్చుకొని ఈ సమయంలో ఎందుకు వచ్చారంటూ వాళ్లను ప్రశ్నించింది. ఇక అప్పటికే మద్యం మత్తులో మునిగిపోయి ఉన్న ఆ సోదరులు ఆమెపై దాడికి పాల్పడరు.
అయితే వాళ్లు తనపై దాడి చేయగానే ఆమె కేకలు వేయడానికి ప్రయత్నించగా.. అది గమనించిన అన్నదమ్ములు ఆమె నోరు మూసివేశారు. ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇక ఆమె కాసేపటికి స్పృహకోల్పోనప్పటికీ.. కామాంధులు ఆమెను వదలేదు. ఆ తరువాత చాలా సేపటికి వాళ్ళు ఆమె వదిలి అక్కడి నుండి పారిపోయారు. ఇక ఉదయం స్పృహలోకి వచ్చిన ఆమె బోరున విలపిస్తూ తన భర్తకు ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. అనంతరం ఆమె భర్త, కుటుంబ సభ్యులతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.