ఈ మధ్యకాలంలో మనుషులు అడవిలో బ్రతికే జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. వావి వరసలు మరిచి పోయి దారుణాలకు పాల్పడుతున్నారు. క్షణకాల సుఖం కోసం రక్తసంబంధంని సైతం మరిచిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోజురోజుకు ఇలాంటి తరహా ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయ్. అదే సమయంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో హత్యలు ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కోడలు పై మోజు పెంచుకున్న మామ ఏకంగా తన కొడుకుని హతమార్చేందుకు కూడా సిద్ధమయ్యాడు.



 ఇటీవలే ప్రకాశం జిల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టడం తో ఊహించని నిజాలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళితే ఏల్చూరు ఎస్సీ కాలనీకి చెందిన కరుణయ్యకు ఇద్దరు కుమారులు చిన్నతనంలోనే భార్య చనిపోవడంతో ఇక ఇద్దరు పిల్లల్ని అతనే పెంచి పెద్దచేశాడు  ఇద్దరు కుమారులకు పెళ్ళిల్లు కూడా అయ్యాయి  ఈ క్రమంలోనే పెద్ద కుమారుడైన లక్ష్మయ్యకు గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన సునీతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా లక్ష్మయ్య దగ్గరే తండ్రి కరుణయ్య కూడా ఉంటున్నాడు.



 ఇటీవలి కాలంలో లక్ష్మయ్య మద్యానికి బానిస గా మారిపోయాడు. ఇక ఇదే అదనుగా భావించిన  కోడలి పై కన్నేశాడు కరుణయ్య. కూతురిలా చూసుకోవాల్సి కోడలితో వివాహేతర సంబంధానికి తెరలేపాడు. లక్ష్మయ్య ఈ విషయం తెలిసిన లోలోపలే కుమిలిపోయాడు.  అయితే కోడలితో సుఖానికి కన్నకొడుకుఅడ్డు వున్నాడని భావించి ఇక అడ్డు  తొలగించుకునేందుకు నిర్ణయించాడు. ఇక ప్లాన్ ప్రకారం లక్ష్మయ్య నిద్రలో ఉన్న సమయంలో రాళ్లతో కర్రలతో కొట్టి దారుణంగా చంపేశారు.  ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చి పెట్టి ఎక్కడ ఆనవాలు లేకుండా చేశారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి ఇక విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: