
ఆడపిల్ల పుట్టిందంటే ఆ ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని భావించి పండగలను చేసుకుంటున్నారు. అయినా కొందరు మాత్రం మరొక మూర్ఖపు ఆలోచన విడడం లేదు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నారు. పూర్వకాలంలో మహిళలంటే వెనుకబడి ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఆడపిల్లలదే పై చేయి అవుతోంది. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కూడా అంతకంతకు పెరుగుతున్నాయి. సమాజం ఇలా సాంకేతికంగా ముందుకు వెళ్తున్నా కొంతమంది మాత్రం ఆడ మగ అనే తేడాలు ఇంకా చూపిస్తూనే ఉన్నారు. ఆడపిల్లలంటేనే పిల్లలని కనిపెట్టే మిషన్లుగా చూస్తున్నారు. కొన్నిచోట్ల మగ పిల్లల కోసం బ్రుణ హత్యలు కూడా చేయిస్తున్నారు. ఇలాంటి ఒక ఘటన ముంబై పట్టణంలో వెలుగులోకి వచ్చింది. ముంబై పట్టణంలోని ఉండే దాదర్ లో ఒక భర్త అరాచకాలు చూసి చాలామంది షాక్ కు గురయ్యారు. ఒక నలభై సంవత్సరాల మహిళ తన భర్త యొక్క కోరిక మేరకు, ఎనిమిది సార్లు అబార్షన్ చేయించు కోవాల్సి వచ్చింది. అది కూడా ఆమెకు కారణం ఏమిటో కూడా తెలియకుండానే, అంటే భర్త ఏ రేంజ్ లో ఆమెను చిత్రహింసలు పెట్టాడో అర్థం చేసుకోవచ్చు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సదరు మహిళకు పెళ్లి 2017 సంవత్సరంలో జరిగింది. కొడుకు పుట్టాలని ఆలోచనతో విదేశాల్లో ఆమెకు ఎనిమిదిసార్లు అబార్షన్ కూడా చేయించాడు అని బాధితురాలు తెలిపింది.