ఇతర జీవులతో పోల్చి చూస్తే అటు మనిషిలో ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది అని చెబుతూ ఉంటారు. ఆలోచన శక్తితోనే ఎంతో విచక్షణతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు అని చెబుతారు. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మాత్రం మనుషుల్లో అసలుఆలోచన శక్తి రోజురోజుకు కనుమరుగైపోతుంది అన్నది అర్థం అవుతుంది  ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ షాక్ ఇస్తున్నారు. ఇక ఏకంగా నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 సాధారణంగా పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇక ఈ అర్థం చేసుకునే క్రమంలోనే చిన్నపాటి గొడవలు జరగడం కూడా సహజమే. కానీ ఇలాంటి చిన్నపాటి గొడవలతో ఎంతోమంది క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా  క్షణికావేశం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. లింగాపూర్ నాయక్ తండ కు చెందిన రాథోడ్ గోవర్ధన్ అనే 23 ఏళ్ల యువకుడికి గత ఏడాది దివ్య అనే యువతితో పెళ్లి అయింది. అయితే ఇటీవల నాగుల పంచమి సందర్భంగా దివ్య పుట్టింటికి వెళ్ళింది. ఆ తర్వాత భార్యను తీసుకురావడానికి గోవర్ధన్ వెళ్ళగా.. కొన్ని రోజుల తర్వాత పంపుతాము అంటూ అత్తమామలు చెప్పారు.


 అయితే ఈ చిన్న విషయానికి ఎంతో మనస్తాపం చెందాడు గోవర్ధన్. ఈ చిన్న విషయానికి షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా ఈ జీవితం వృధా అనుకొని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలి అని నిర్ణయించుకున్నాడు.  ఇంట్లో ఎవరూ లేని సమయంలో  గోవర్ధన్ ఏకంగా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటికి వచ్చిన  కుటుంబ సభ్యులు గోవర్ధన్ పురుగుల మందు తాగడాన్ని గమనించి వెంటనే రిమ్స్ లో చేర్పించారు. కాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇలా పెళ్లై ఏడాది కూడా కాకముందే ఏకంగా భర్తను కోల్పోయి ఆ యువతి అరణ్యరోదన తో విలపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: