కేవలం అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఎంతో మంది యువకులను నమ్మించి మాయమాటలతో మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది యువకులు ఇక ప్రేయసి చేసిన ద్రోహాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆ యువకుడిని ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారు. దీంతో అతని మనస్సు బరువెక్కింది. ఏం చేయాలో అర్థం కాలేదు. బాధ ఎవరికి చెప్పుకోవాలి తోచలేదు. చివరికి ఇక చావే శరణ్యం అనుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లో వెలుగులోకి వచ్చింది. మొరిపిరాల కు చెందిన సందీప్ కి స్రవంతి అనే అమ్మాయి తో పరిచయం ఉంది. ఇక ఆ యువతి మరో ఇద్దరు యువతులను తన స్నేహితులు అంటూ సందీప్ కు పరిచయం చేసింది. ఈ క్రమంలోనే ఇక సందీప్ తో ముగ్గురు యువతులు కూడా ఎంతో చనువుగా వుండే వారు. ఈ క్రమంలోనే ఏకంగా లక్ష రూపాయలు అవసరం ఉన్నాయి అని అడగడంతో వెంటనే సందీప్ ఆ డబ్బులు ఇచ్చాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా డబ్బులు రిటర్న్ ఇవ్వమని అడిగేసరికి యువతులు అసలు రంగు బయట పెట్టారు . మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగాడు.