రోజురోజుకు మూఢనమ్మకాలు పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ఎంత పెరిగినా వీరిలో మాత్రం మార్పు రావడం లేదు. ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్ అయి ఉండి కూడా తన కూతుళ్లను దేవుళ్ల పేరుతో బలి ఇచ్చారు. ఇలా మూఢనమ్మకాలకు పోయి వారి ప్రాణాలు వారి తీసుకుంటూన్నారు. అలాంటి ఒక షాకింగ్ ఘటన  మనం చూద్దాం. యువతి చనిపోయిన విధానం చూస్తే మనకు గుండె దడ వస్తుంది. మనం ఇప్పటి వరకు  గ్రామాల్లో మేకలను, కోళ్లను, బలి ఇవ్వడం మాత్రమే చూశాం. కానీ ఈ యువతి అతి మూఢనమ్మకంతో తనకు తానే బలితీసుకుంది. యదార్థ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణంలో కలకలం రేపింది. యువతి స్థానిక భద్రకాళి దేవాలయంలో గుడి గంటలకు ఉరి వేసుకొని  ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే .. ఇప్పటివరకు  చాలా గ్రామాలలో దేవతలకు పొట్టేళ్లను, కోళ్లను బలి ఇవ్వడం మాత్రమే చూశాం. కానీ ఒక యువతి తనకు తానే బలి ఇచ్చుకొని స్థానికంగా భయాందోళన సృష్టించింది.

పోలీసుల వివరాల ప్రకారం  మీరట్ జిల్లాలోని  కర్కోడ పోలీస్ స్టేషన్ దగ్గరలోని కుది గ్రామ సమీపంలో అడవిలో ఈ భద్రకాళి ఆలయం ఉన్నది. ఈ యొక్క యువతీ ప్రతిరోజూ అమ్మవారిని పూజించేది. ఇలా యువతి  తానే కాళీ మాత కుమార్తెగా భావించుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడింది.. ఆ యువతి రోజులాగే ఉదయం పూట ఆలయానికి వెళ్ళింది. ఈ యొక్క ఆలయం అడవి ప్రాంతంలో ఉండడంతో ఆ సమయంలో ఎవరూ లేరు. పూజారి కూడా ప్రతిరోజు సాయంత్రం వచ్చి పూజ చేసి వెళ్లిపోతాడు. దీంతో ఆ యువతి పూజ చేసి  ఈ యొక్క ఊహించని నిర్ణయం తీసుకుంది. తనకు తానే అమ్మవారికి బలి కావాలనుకుని గొంతు కోసుకుని చిమ్ముతున్న రక్తాన్ని కాళీమాత సమర్పించినది. తర్వాత రక్తం కారుతుండగానే గుడి గంటలకు ముందే సిద్ధం చేసి ఉంచుకున్న ఉరిని మెడకు బిగించుకొని చనిపోయింది. సాయంత్రం పూట ఆలయ పూజారి వచ్చి  చూసేసరికి గుడి  గంటలకు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆ పూజారి షాక్ కు గురయ్యాడు. వెంటనే వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించడంతో , వారు పోలీసులకు సమాచారం అందించారు.

 ఆ యువతి అతి మూడనమ్మకం వల్లే ఈ యొక్క అఘాయిత్యనికి పాల్పడిందని పోలీసుల విచారణలో తేలింది. ఆ యువతి కుటుంబం కూడా అంత్యక్రియలు నిర్వహించింది. ఇలా చాలా మంది  మూఢనమ్మకాలతో నిండు జీవితాలను చేతులారా పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ యువతి కుటుంబ సమస్యల వల్ల చనిపోయిందని మరికొందరు అంటున్నారు. అదే రోజు వారి యొక్క కుటుంబీకులతో వాగ్వాదం జరిగిందని దీంతో యువతి  ఆలయానికి వెళ్లి ఉరివేసుకున్నదని అంటున్నారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: