దేవుడిచ్చిన ఎంతో విలువైన ప్రాణాలను ఇటీవలే చాలామంది బలవన్మరణాలకు పాల్ప డి అర్ధాంతరంగా తీసుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని సగంలోనే ముగిస్తున్నారు.  ఇలా నేటి రోజుల్లో ఎంతోమంది చిన్నచిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడి ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నారు.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  జీవితం ఎంతో సాఫీగా సాగిపోతుంది.



 పని చేయగా వచ్చిన కొంత సంపాదనతోనే కుటుంబం మొత్తం సంతోషంగానే జీవిస్తుంది. కానీ ఇంతలో విధి వారి ఆనందాన్ని చూసి వక్రించింది.  దీంతో ఏకంగా ఇంటి పెద్దగా ఉన్న తల్లిదండ్రుల ప్రాణాలను తీసేసింది.  అప్పటివరకు తల్లిదండ్రులు ఉన్నారు అనే ధైర్యంతో బతికిన యువకుడికి తల్లిదండ్రులు లేకపోవడం మాత్రం తీవ్ర మనస్థాపానికి గురి చేసింది.  ఇక ఈ బాధతోనే అతడు మద్యం తాగడం మొదలు పెట్టాడు. చివరికి మద్యం ఆ యువకుడిని బానిసగా మార్చుకుంది.



 అయితే తల్లిదండ్రులు చనిపోయిన నాటి నుంచి కనీసం ఎవరితో మాట్లాడకుండా తనలో తానే కుమిలిపోయాడు ఆ వ్యక్తి. చివరికి జీవితం అతనికి భారం అయిపోయింది. దీంతో ఎంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు. బలవన్మరణాలకు పాల్పడాలి అనుకున్నాడు. ఈ ఘటన చెన్నై లోని తిరుచి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది.  అయ్యాంపట్టి  చెందిన ఇళయరాజా అనే యువకుడు తల్లిదండ్రులు మరణించడంతో మద్యానికి బానిస గా మారిపోయాడు. ఈ క్రమంలోనే ఎవరితో మాట్లాడకుండా తనలో తానే కుమిలి పోతూ ఉండేవాడు. ఇక ఇటీవల బతుకు భారంగా మారి పోయి మద్యం లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అంతకుముందు బాబాయ్ కి ఒక వీడియో పంపాడు. ఇన్నాళ్లు లోకంతో సంబంధం లేకుండా బ్రతకాను.. ఇప్పుడే ఆ విషయం తెలుస్తుంది. నాలాంటి వాడు ప్రాణాలతో ఉండకూడదు. అందరు నన్ను క్షమించండి అంటూ వీడియో రికార్డ్ చేసి బాబాయ్ కి పంపి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: