డ్రగ్స్ డోర్ డెలివరీ ...ఎక్కడో  తెలుసా ?  

 గత కొద్ది  రోజులుగా ఇవే వార్తలు.. మాదకద్రవ్యాల వార్తలు.. కాకపోతే ప్రతి రోజూ ఏదో కొత్తదనం. రోజుకో అట్రాక్షన్. మాదక ద్రవ్యాలకు సంబంధించి కూపీ లాగుతున్నపోలీసులు  అంతుచిక్కని విషయాలు విచారణలో వెలుగు చూస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ లో ప్రముఖ నటుడు షారూక్ ఖాన్  తనయుడు మాదకద్రవ్యాల మత్తులో జొగుతూ రోవ్ పార్టీలో చిక్కుకున్నాడు.  మాదక ద్రవ్యాలు ఎక్కడ దొరుకుతాయి ?   అందరిలో నూ వచ్చే ప్రశ్న ఇది. మాదక ద్రవ్యాలను ఇంటింటికీ సరఫరా అవుతాయి. ఇలా సరఫరా చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు.  భారత దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఐదు కోట్ల రూపాయల విలువైన ఎఫిడ్రిన్ పట్టుకున్న సంఘటన అందరికీ తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పోలీసులలో ని వివిధ విభాగాలు సమన్వయంతో  దాడులు జరుపుతున్నయి. అత్యంత రహస్యంగా ఈ  దాడులు జరుగుతున్నాయి. మాదక ద్రవ్యాల ముఠా కు చెందిన మూలాలను పట్టుకునేందుకు దేశ వ్యాప్తంగా  వివిధ విభాగాల పోలీసులు తలమునకలై ఉన్నారు.

కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ పరిసర ప్రాంతాలలో ఎన్.సిబి అధికారులు , స్థానిక పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించారు. దాదాపు 150 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. రహస్యంగా సాగించిన ఈ ఆపరేషన్ లో ఏడుగురు సభ్యులన్న ముఠాను అరెస్ట్ చేశారు. ఆహార పదార్దాలను డెలివరి చేసే ప్రముఖ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి ఈ డ్రగ్స్ సరఫరా బృందంలో ముఖ్య సూత్రధారి. ఈముఠాలో ఒక వ్యక్తికి హైదరాబా ద్ తో సంబంధాలున్నాయి. ఈ ముఠా ఫుడ్ డెలివరీ తోపాటు తమ ఖాతాదారులకు మాదక ద్రవ్యాలను డోర్ డెలివరీ చేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఫుడె డెలివరీ సిబ్బందిపై నిఘా ఉంచడంతో వారి వ్యవహారం బహిర్గతమైంది. వీరంతా ఒక పెద్ద భువంతిని అద్దెకు తీసుకుని అక్కడ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను ఐదు గ్రాములు, పది గ్రాముల ప్యాకెట్లలో నింపి ఆహార పదార్దాలతో పాటుగా డోర్ డెలివరీ చేసేవారు. వారి నివాసం ఉన్న భవనంలోనే గంజాయిని ప్యాకింగ్ చేసేందుకు అనువుగా పెద్ద పెద్ద యంత్రాలను కూడా అక్కడ సమకూర్చారు. ఆ భవనం నుంచి గంజాయిని డోర్ డెలివరి చేసేందుకు తీసుకు వెళుతున్న సమయంలో ముఠా ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రెలియాకు తరలిస్తూ ముంబైలో పట్టుబడిన డ్రగ్స్ హైదరాబాద్ నుచి సరఫరా కావడం, తాగాజా కర్ణాటకలో దొరికిన ముఠా సభ్యుడికి హైదరాబాద్ తో సంబంధాలు కలిగి ఉండడటం పోలీసులు మరింత లోతుగా కేసును పరిశోధన చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: