మొన్నటి వరకు కేవలం బయట వారితో మాత్రమే లైంగిక వేధింపులు ఎదుర్కొనేది ఆడపిల్ల. నేటి రోజుల్లో ఏకంగా రక్తం పంచుకుని పుట్టిన వారి దగ్గర కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటుంది. అంతే కాదు కన్నతండ్రె ఆడ పిల్లల పై అత్యాచారం చేసిన ఘటనలు ప్రతి ఒక్కరిని సిగ్గు పడేలా చేస్తున్నాయి అని చెప్పాలి. ఓవైపు ప్రతి ఒక్కరు నాగరిక సమాజం వైపు అడుగులు వేస్తున్నారు అని చెబుతున్నారు. కానీ ఈ రోజుల్లో ఇంకా ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే సభ్య సమాజం నాగరికత వైపే అడుగులు వేస్తూ రోజురోజుకు దిగజారిపోతుంది అన్నది అర్థం అవుతుంది. ఇక్కడ ఓ వృద్ధుడి కామపు కోరల్లో చిక్కుకొని అభం శుభం తెలియని మైనర్ బాలిక బలయ్యింది. 55 ఏళ్ళ వయసులో ఉన్న వృద్ధుడు 17 ఏళ్ల చిన్నారిని మనవరాలి లాగా దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడాల్సింది పోయి కామం తో ఊగిపోయాడు.
చివరికి 17 ఏళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. చివరికి ఈ కామాంధుడు చేసిన పనికి అభం శుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లపూర్ లో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై 55 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చింది. టీవీ చూడటానికి వచ్చిన సమయంలో వృద్ధుడు మాయమాటలతో లొంగదీసుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే బాలిక అస్వస్థతకు గురికావడంతో వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులు మందలించడంతో ఇక బాలిక అసలు విషయం చెప్పింది. ఇక దీంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.