రోజురోజుకు మానవత్వం మంటగలిసి పోతుంది. అక్రమ సంబంధం కోసం మన అన్న వాళ్లనే హతమార్చిన స్థాయికి మనుషులు వచ్చారు. ఇన్ని రోజులు ప్రియుడి కోసం భర్తను, ప్రియురాలి కోసం భార్యలను చంపడాన్ని చూశాం.. కానీ తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని
కన్నా తల్లిని హతమార్చిన ఈ కసాయి కూతురు ఇప్పుడే చూస్తున్నాం. అది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం..?
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో దారుణం జరిగింది. కన్న తల్లిని కడతేర్చిన కసాయి కూతురు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రియుడి సాయంతో కన్నతల్లిని ఉరివేసి చంపిన కసాయి కూతురు. తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని కన్నతల్లిని హతమార్చిన ఇటువంటి సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో యాదమ్మ, యాదయ్య దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు ఇందులో మొదటి కుమార్తె వివాహం అయింది. రెండో కుమార్తె అనారోగ్యంతో మరణించింది. తమ్ముడు ఒక కుమార్తె నందిని తన తల్లిదండ్రులతోనే ఇంట్లోనే ఉంటుంది. అలాగే ఇంట్లో నిన్న చోటు మరియు నందిని ఏకాంతంగా కనిపించడంతో తల్లి ఆ సమయంలోనే రావడంతో ఇద్దరు కలిసి ఏకాంతంగా ఉన్నప్పుడు తల్లి చూసిందని ఆమె తట్టుకోలేక పోయింది.ఇక్కడ ఉన్నటువంటి ఒక చున్నీతో తల్లి యాదమ్మ మెడకు గట్టిగా చుట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చిన కూతురు. అయితే ఈ యొక్క అక్రమ పరిచయం నందిని గత ఏడాది నుంచి సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ వస్తోందని కుటుంబ సభ్యులు చెబుతున్న టువంటి మాటలు వింటే తెలుస్తోంది. అయితే ప్రియుడు చంటి నందిని కలిసి ఉన్నప్పుడు తన తల్లి చూడడంతో ఇద్దరి మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంలోనే తన ప్రియుడితో కలిసి నందిని తన తల్లిని హతమార్చింది. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ విచారణలో నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో బుద్ధి చెప్పడంతో తానే నేరం చేశానని ఒప్పుకుంది.