ఓ ఉపాధ్యాయుడు త‌న‌లో ఉన్న కామాన్ని ప్ర‌ద‌ర్శించాడు.  పిల్ల‌లంద‌రిలోను అదే దృష్టితో చూశాడు. విద్యార్థుల‌కు విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే హ‌ద్దులు మీరాడు. చ‌దువుకోవ‌డానికి పాఠ‌శాల‌కు వ‌చ్చే విద్యార్థునుల పట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు.  ఇది అంతా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి  ప‌ట్ట‌ణంలోని వ‌డ్డెప‌ల్లి 13వ వార్డు శాలివాహ‌న్‌న‌గ‌ర్‌లోని ఉర్దూమీడియం పాఠ‌శాల‌లో జ‌రిగిన ఈ వ్య‌వ‌హారం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఉర్దూమీడియం పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా ప‌ని చేస్తున్న హుస్సెన్  చేష్ట‌ల‌కు అంతులేకుండా పోయింది. కొంద‌రూ విద్యార్థుల‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని త‌ల్లిదండ్రుల దృష్టికి వ‌చ్చింది. దీంతో వారి ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకొని.. బాధ్య‌త‌గా ఉండాల్సిన ఉపాధ్యాయుడే ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.  కొంత మంది త‌ల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదులు కూడ చేశారు.  ఉపాధ్యాయుడిని న‌మ్మి చిన్న‌ పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌ల‌కు పంపి.. త‌ల్లిదండ్రులు పొలాల‌కు వెల్లి వ్య‌వ‌సాయ ప‌నులు చేసుకుంటుంటే ఈ విధంగా చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.      

వివ‌రాల్లోకి వెళ్లితే.. కొమెరెపూరి గ్రామానికి చెందిన షేక్ హుస్సెన్ శాలివాహ‌న్‌న‌గ‌ర్‌లోని ఉర్దూమీడియం పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడిగా ప‌ని చేస్తున్నాడు. ఇత‌ను విద్యార్థినుల‌కు నీలి చిత్రాల‌ను చూపించ‌డం, అనుచితంగా ప్ర‌వ‌ర్తించ‌డం, లైంగిక‌దాడికి య‌త్నించ‌డం వంటివి చేస్తున్నాడ‌ని విద్యార్థినులు ఉపాధ్యాయునిపై త‌ల్లిదండ్రుల‌కు తెలిపారు. దీంతో ఆగ్ర‌హించిన త‌ల్లిదండ్రులు పాఠ‌శాల వ‌ద్దకు చేరుకొని ఆందోళ‌న నిర్వ‌హించారు. ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు త‌ల్లిదండ్రుల‌ను పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు పిలిపించి మాట్లాడారు. ఉపాధ్యాయుడు హుస్సెన్ ను త‌మ‌కు అప్ప‌గించాలంటూ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు దిగారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. డీఎస్పీ రామిరెడ్డి విజ‌య‌భాస్క‌ర్‌రెడ్డి, సీఐ న‌ర‌సింహారావులు విద్యార్థినుల త‌ల్లిదండ్రులతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఫిర్యాదు చేస్తే విచార‌ణ చేప‌ట్టి చ‌ర్య‌లు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. దీంతో త‌ల్లిదండ్రులు శాంతించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న స‌త్తెన‌ప‌ల్లి ప‌ట్ట‌ణంలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: