నేటి సమాజంలో చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు సోషల్ మీడియాలో చాల యాక్టివ్ గా ఉంటున్నారు. ఇక చాలా మంది తమలోని టాలెంట్ ని బయట పెట్టేందుకు రీల్స్, వీడియోస్ లాంటివి చేస్తున్నారు. అయితే మరికొంత మంది హాట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అవుతున్నారు. అయితే పాపులర్ అయిన వాళ్లలో తమిళనాడుకు చెందిన సుగంధి అనే మహిళ ఒకరు. ఆమెకి వీడియోల మీద ఉన్న క్రెజ్ తో చివరకి భర్తను కూడా దూరం చేసుకుంది. సుగంధి మహిళకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక్కసారి చూద్దామా.

తమిళనాడుకు చెందిన సుగంధి భర్త ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నాడు. వీరిద్దరికి సంవత్సరం వయసున్న పాప కూడా ఉంది. అయితే సుగంధి సోషల్ మీడియాపై ఆసక్తి ఎక్కువగా ఉండటంతో  టిక్‌టాక్‌లో హాట్‌హాట్ వీడియోలు చేస్తూ ఉండేది. ఈ కారణంగా ఆమె తన భర్తకు దూరంగా తన కూతురిని తీసుకుని ఓ ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. అంతేకాదు.. సుగంధి టిక్‌టాక్‌లో దివ్య అనే మహిళతో వీడియోల రూపంలో గొడవ పెట్టుకుంది. వారిద్దరూ పాపులారిటీ కోసం దుర్భాషలాడుకుంటూ చూసేవాళ్లకు వినోదాన్ని పంచుతూ ఉండేవారు. కాగా.. సోషల్ మీడియాలో దివ్యపై దుర్భాషలాదినందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. అయిన్నప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.

మన దేశంలో టిక్ టాక్ బ్యాండ్ చేసిన తరువత సుగంధి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌లో వీడియోలు చేయడం స్టార్ చేసింది. అంతేకాదు.. యూట్యూబ్‌లో తన పేరుతో ఒక ఛానల్ ని స్టార్ చేసింది. ఈ ఛానెల్ లో సుగంధి అసభ్యకరమైన మాటలు, వీడియోలు పెడుతూ ఉండటంతో ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సుగంధి ఆ ప్రాంతం నుండి పరారైపోయింది. చివరకు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: