వివరాల్లోకి వెళ్లితే.. ఉజ్జయినీలోని కథ్ బరోడా గ్రామానికి చెందిన రాజ్‌పాల్‌సింగ్, చంద్రకాంతలు భార్య భర్తలు. వారికి పిల్లలు లేరని ఈ దంపతులు తరుచూ బాధపడుతుండేవారు. ఈ తరుణంలోనే తనకు తెలిసిన కొందరి వ్యక్తుల సహకారం, పలుకుబడి ఉపయోగించి రాజ్‌పాల్‌సింగ్ మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి 21 ఏండ్ల మహిళను ఉజ్జయినికి తీసుకొచ్చాడు. తన సతీమణి చంద్రకాంత సహాయంతో పలుమార్లు ఆ మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. చంద్రకాంత-రాజ్‌పాల్ సింగ్ దంపతులకు ఇదివరకే ఇద్దరు పిల్లలు పుట్టి చనిపోయారు. మరల పిల్లలు కలగపోవడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
నాగపూర్‌కు చెందిన మహిళ సాయంతో వారు తల్లిదండ్రులు అవుదామని భావించి తీసుకొచ్చారు. ఆ మహిళను చిత్ర హింసలు పెట్టేవారు. అందులో భాగంగానే ఆ మహిళలను నిత్యం టార్చర్‌కు గురిచేసి రాజ్‌పాల్‌సింగ్ బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. దాదాపు 16 నెలలోనే ఇంట్లోనే బంధించి పలుమార్లు లైంగిక దాడి చేసారు. ఆ బాధితురాలు ఈ మధ్యనే ఓ బిడ్డకు జన్మినిచ్చింది. నిందితుడు రాజ్‌పాల్‌సింగ్ ఆ మహిళను బస్టాండ్‌లోనే వదిలిపెట్టి వెళ్లాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మహిళను పోలీసులు గమనించి ఆరా తీయగా ఈ తతంగం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు రాజ్‌పాల్ సింగ్ దంపతులతో పాటు వీరికి సహకరించిన వీరేంద్ర, కృష్ణపాల్, అర్జున్‌లపై హ్యుమన్ ట్రాఫికింగ్, అత్యాచార యత్నం, కిడ్నాపింగ్ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసారు.