
ఇక కొంతమంది అయితే సరదా కోసం విపరీత బుద్ధితో ఏకంగా ఎదుటివారిని హింసిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న వారు కూడా ఉన్నారు.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఏకంగా ఒక వ్యక్తి శరీరంలోకి బలవంతంగా గాలి నింపుతూ మరణించేలా చేశారు ఇక్కడ కొంతమంది శాడిస్టులు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లో వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో ఉన్న రెహమత్ అలీ వర్కర్ గా పని చేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే డ్యూటీ కి వెళ్ళాడు రెహమాత్.
ఈ క్రమంలోనే ఇక తోటి వర్కర్లు అతని ఆట పట్టించారు. కేవలం మాటలతో ఆటపట్టించడం మాత్రమే కాదు ఏకంగా దారుణంగా అతని మలద్వారం లో కి బలవంతంగా గాలిని కూడా పంపారు. ఇక అక్కడ తోటి వర్కర్లు ఎక్కువ మంది ఉండడంతో నిస్సహాయుడు గా మారిన రహమత్ వదిలిపెట్టాలని ఎంత ప్రాధేయపడినా రాక్షస బుద్ధి కలిగిన ఆ తోటి వర్కర్లు మాత్రం అస్సలు వినలేదు. తర్వాత అతని ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చివరికి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బలవంతంగా గాలిని శరీరంలోకి పంపడం వల్ల అతడి శరీరంలోని కాలేయం పూర్తిగా పాడైపోయి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.