నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డను కంటికి రెప్పలా చూసుకుంటుంది. ఏ చిన్న కష్టం రాకుండా అనుక్షణం కాపాడుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఆడపిల్ల పుడితే సభ్య సమాజంలో జరుగుతున్న ఘటనలకు భయపడి మరింత జాగ్రత్తగా కూతురుని చూసుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక తల్లి మాత్రం ఏకంగా తల్లి ప్రేమకే కళంకం తెచ్చే విధంగా వ్యవహరించింది. ఏకంగా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ పై మమకారాన్ని మరచిన ఆ తల్లి కూతురు తో భిక్షాటన చేయించడం మొదలు పెట్టింది.


 అంతటితో ఆగకుండా మరింత దారుణంగా వ్యవహరించిందని. ఏ తల్లి చెయ్యకూడని పని చేస్తుంది. పేగు బంధాన్ని మరిచి సొంత కూతురిని వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి తీసుకు వచ్చింది ఆ తల్లి.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లో నివసించే పదహారేళ్ల బాలిక తో  తల్లి భిక్షాటన చేయిస్తుంది. ఇక కూతురు బిక్షాటన చేసుకొని తెచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు పెట్టుకుంటుంది ఆ తల్లి. అయితే ఇటీవల ఇది గమనించిన ఓ వ్యక్తి ఇటీవల చైల్డ్ లైన్ కు సమాచారం అందించాడు.




 అయితే చైల్డ్ లైన్ సభ్యురాలు మహేశ్వరి ఇక ఆ బాలిక కోసం గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో వెనక్కి వెళ్ళి పోయింది. ఇక ఇటీవలే ఖమ్మం చైల్డ్ లైన్ సమన్వయకర్త శ్రీనివాస్ ఖమ్మం బస్టాండ్ వద్ద బాలిక ఉండటాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే ఆ బాలికను తమ సంరక్షణ లోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలికను విచారించగా తల్లిన తన తో బలవంతంగా భిక్షాటన చేయించడమే కాదు వ్యభిచారం కూడా చేయాలి అంటే ఒత్తిడి తీసుకు వస్తుంది అని బాలిక చెప్పడంతో  అధికారులు షాక్ అయ్యారు. ఇక బాలిక ఫిర్యాదు మేరకు తల్లి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: