అయితే ఒకప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం అంటే ఉరి వేసుకోవడం లాంటివి చేసుకునే వారు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఆత్మహత్యలు చేసుకోవడం విషయంలో కూడా కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. నొప్పి లేకుండా బలవన్మరణానికి పాల్పడటం ఎలా అని ఆలోచిస్తూ చిత్ర విచిత్రంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. హైదరాబాద్లోని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప జిల్లా బద్వేలు కు చెందిన డాక్టర్ రాజ్కుమార్ అనే 29 ఏళ్ళ వైద్యుడు. అమీర్పేటలోని శ్యామ్ కరణ్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నాడు.
బి.కె గూడా లో ఓ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు.. అయితే స్నేహితుడికి ఫోన్ చేసి మనసు బాగా లేదు అంటూ చెప్పాడు రాజ్కుమార్. ఆ తర్వాత స్నేహితులడు మళ్ళీ తిరిగి ఫోన్ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చి ఇక అతని గదికి వెళ్లి చూడగా తన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకొని అపస్మారక స్థితిలో కనిపించాడు డాక్టర్ రాజ్కుమార్. వెంటనే స్నేహితుడు అతన్ని ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. అయితే సెలైన్ లో విషం ఎక్కించినట్లు గుర్తించారు. ఇక అతని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.