ఏంటో ఈ రోజుల్లో మనిషి ప్రాణానికి అసలు విలువ లేకుండా పోతుంది. ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు అటు మనిషి ప్రాణాలను బలి తీసుకోవడానికి దూసుకు వస్తూనే ఉన్నాయి.  ప్రాణాలు కాపాడుకోవడానికి మనిషి ఎంత ప్రయత్నాలు చేస్తున్నా ఎంతోమంది చివరికి మహమ్మారి ప్రాణాంతకమైన వైరస్ బారిన పడి చనిపోతున్న ఘటనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇలా ఒక వైపు మనుషుల ప్రాణాలు తీయడానికి ఎన్నో రకాల వైరస్లు దూసుకు వస్తుంటే ఇక వాటికి శ్రమ కలిగించడం ఎందుకు అనుకుంటున్నారో ఏమో ఎంతోమంది బలవంతంగా ఆత్మహత్యకు పాల్పడుతూ ప్రాణాలను వదులుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెంది అక్కడితో జీవితం ముగిసి పోయింది అని భావిస్తూ ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.. ఇలా ఇటీవలి కాలంలో ఎంతో మంది క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎన్నో కుటుంబాల్లో అరణ్యరోదన మిగులుస్తున్నాయి. ఇక్కడ ఓ యువకుడు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. తమ కొడుకు చదువుకుని ఎంతో ప్రయోజకుడు అవుతాడని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. అనుకున్నట్లుగానే బాగా చదువుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరాడు.



 తమ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు అని తల్లిదండ్రులు సంతోషపడుతున్న సమయంలో వీరి సంతోషాన్ని చూసి విధి ఓర్వ లేక పోయిందో ఏమో చివరికి ఆత్మహత్య రూపంలో కొడుకు ప్రాణాలు తీసింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కు చెందిన నవీన్ కుమార్ అనే 24 ఏళ్ల యువకుడు మధుర నగర్ లో ఉన్న ఈఫీల్ టెక్ సొల్యూషన్స్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అమీర్పేట్ లో ఉన్న లక్ష్మీనరసింహ బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. ఇకపోతే ఇటీవల ఏం జరిగిందో తెలియదు కానీ హాస్టల్ భవనం ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితున్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: