మానవతా విలువలు మర్చిపోతున్న మనుషులు మానవ బంధాలు బంధుత్వాలకు అసలు విలువ ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే మానవత్వాన్ని సైతం మరిచి దారుణం గా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏకంగా సొంత వాళ్ల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు నేటి రోజుల్లో మనుషులు. ముఖ్యంగా క్షణకాల సుఖం కోసం అక్రమ సంబంధాలకు తెర లేపుతున్నారు. కట్టుకున్న వారిని మోసం చేయడమే కాదు అవసరమైతే ఏకంగా అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ కోసం కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వస్తున్నాయి.


 ఇలా అక్రమ సంబంధాల పేరుతో ఎంతో మంది ఏకంగా సొంత కాపురంలో చిచ్చు పెట్టకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో హత్యలు కూడా వెలుగులోకి వస్తూ ఉండడం గమనార్హం. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.  ప్రియుడి మోజులో పడిపోయిన భార్య తాళికట్టిన భర్త కంటే ప్రియుడితో సుఖమే ముఖ్యం అని అనుకుంది.చివరికి దారుణంగా కట్టుకున్న భర్తను హత్య చేసి పసుపు కుంకుమలను చేజేతులారా చెరిపేసుకుంది ఆ మహిళ. ఈ ఘటన తిరువొత్తియురు లోని  సెలంలో వెలుగు లోకి వచ్చింది.



 ఎస్ఎంసి కాలనీలో సేతుపతి ప్రియా దంపతులు నివసిస్తున్నారు. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇకపోతే ఇటీవల ప్రియా పక్కింట్లో ఉంటున్న సతీష్ కుమార్ తో వివాహేతర సంబంధానికి తెరలేపింది.. భర్తకు తెలియకుండా వీరిద్దరూ రాసలీలల్లో మునిగి తేలుతూ ఉండేవారు. ప్రియుడితో సుఖానికి భర్త సేతుపతి అడ్డు వస్తున్నాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి హత్య చేయాలని భావించింది. పక్క ప్లాన్ ప్రకారం దారుణంగా హత్య చేసి నీటి తొట్టిలో పడేసింది. కొన్ని రోజుల తర్వాత నీటి సంపు నుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే భార్య ప్రియా ఆమె ప్రియుడు సతీష్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: