ప్రేమ ఒక మధురానుభూతి.. జీవితంలో ఏ బంధం పంచలేని గొప్ప అనుభూతులను ప్రేమ పంచుతుంది అని చెబుతూ ఉంటారు. నిజమైన ప్రేమ ఎప్పటికీ విడిపోదు అని చెబుతూ ఉంటారు. నేటి రోజుల్లో మాత్రం ప్రేమ అనేది ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.  యువతీ యువకుల మధ్య పుడుతున్న ప్రేమ ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసి పోవడానికి కారణం అవుతుంది. ఆధునిక సమాజంలో కూడా ఇంకా కులం మతం అంటూ పరువు హత్యలు పెరిగిపోతున్నాయ్ తప్ప ఎక్కడా తగ్గడం లేదు. నేటి రోజుల్లో యువతీ యువకుల మధ్య పుడుతున్న ప్రేమ చివరికి ఎన్నో దారుణాలకు కారణం అవుతుంది అని చెప్పాలి. ఇలా ఇటీవలి కాలంలో ప్రేమించిన ఎన్నో జంటలు ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక మరోవైపు ఇక తమకు ఇష్టం లేని వివాహం చేసుకున్నారు అన్న కారణంతో కన్నబిడ్డనే దారుణంగా మారుస్తున్న పరువు హత్యలు కూడా అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. కన్న పేగు బంధం కంటే పరువు ముఖ్యం అని అనుకుంటున్న తల్లిదండ్రులు ఇటీవల కాలంలో ఎంతోమంది వెలుగులోకి వస్తున్నారు. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది  కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నాడు అనే కారణంతో ఏకంగా  పగ పెంచుకున్నాడు తండ్రి. దీనికోసం ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నాడు.  సమయం చూసి కోడలిని దారుణంగా హతమార్చాడు ఘటన స్థానికంగా అందరినీ ఒక్క సారిగా ఉలిక్కి పాటుకు గురి చేసింది అని చెప్పాలి


 కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన సౌందర్య సాయి కృష్ణ కొన్నాళ్ళపాటు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో ఇక ఇద్దరు పెద్దలని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కొన్నాళ్లకే వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడడంతో సాయికృష్ణ మద్యానికి బానిస గా మారిపోయాడు.  భార్య దూరమైంది అంటూ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. సౌందర్య అదే గ్రామంలోని తన పుట్టింట్లో ఉంటుంది. ఈ క్రమంలోనే తన కుమారుడి మరణానికి కారణమైన సౌందర్య బ్రతక కూడదు అని సాయి కృష్ణ తండ్రి పగ పెంచుకున్నాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో సౌందర్య పై కత్తితో దాడి చేసి దారుణంగా హతమార్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: