ఇటీవలి కాలం వరకూ మత్తు మందుల రవాణాకు సంబంధించి దేశం అట్టుడికింది. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ హస్తం ఉందని, పాలకుల తీరుపై విచారణ జరపాలని ప్రతిపక్షాలు మీడియా ముందు చాలా చాలా డిమాండ్ లు చేశారు. ఆ విషయం కాస్తా సద్దుమణక ముందే విజయవాడ కేంద్రంగా మరో మాఫియా వెలుగు చూసింది.
మెడికల్ మాఫియా... ఈ పదానికి పాత్రికేయలోకం చాలా పెద్ద అర్ధాలు వెల్లడిస్తుంది. కరోనా మహమ్మారి ప్రపంచం పై పడగ వేసినప్పుడు వైద్య రంగం వ్యవహరించిన తీరును ఇప్పటికే జనం మర్చిపోలేదు. ఆసుపత్రుల్లో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారి సంగతి అటుంచితే వారి ప్రాణాలు కాపాడుకోవడానికి వారి కుటుంబ సభ్యులు ఒక విధంగా దీవాలా తీశారనే చెప్పవచ్చు. ఇది ఎవరూ కాదన లేని నిజం.  కేవలం పది రోజ ల హోం క్వారంటైన్ కు ఆసుపత్రులు లక్షల్లో ఫీజులు వసూలు చేశాయి. సామాన్యుడ్ని పీల్చి పిప్పి చేశాయి. కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా మంది తమపుస్తేలను కూడా తాకట్టు పెట్టారు. ఇదే మీ రహస్యం కాదు. బహిరంగంగా అందరికీ తెలిసిన విషయం. ఇదీ ఇప్పటికీ దేశంలో నడుస్తోంది.
తాజాగా విజయవాడలో మరో మెడికల్ మాఫియా వెలుగు చూసింది. ఇది ఎంత కాలంగా సాగుతోంది అనే విషయం పై అధికార యంత్రాంగం వద్ద సరైన సమాధానం లేదు. నయా మెడికల్ మాఫియా తమిళనాడు పోలీసులు ఆంధ్రలో చేసిన విచారణ కారణంగా వెలుగు చూసింది. విజయవాడ కేంద్రంగా కొందరు వ్యక్తులు ఈ మాఫియాను నడుపుతున్నారు.  విజయవాడకు చెందిన కొన్ని మెడికల్ హోల్ సేల్ షాపుల నుంచి  టైడాల్-100 ఎంజి మందులు పది మాత్రలుండే అట్టను స్థానికంగా మూడు వందల రూపాయలకు కొనుగోలు చేసి చెన్నై లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. చెన్నైలో వీటి ధర పది మాత్రలు రెండు వేల రూపాయలకు పై చిలుకు మొత్తానికి విక్రయిస్తున్నారు. ఈ మాత్రలు నొప్పిని నివారించేవి అయినా ఎక్కువ మత్తును కలిగించేవి కావడంతో చెన్నైలో వీటికి డిమాండ్ అధికంగా ఉంది.  పై పెచ్చు ఈ మందులను వైద్యుడి చీటీ లేకుండా విక్రయించరు. దీంతో కొందరు వ్యక్తులు విజయవాడ నుంచి పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకుంటున్నారు. చెన్నై పోలీసులుకు సమాచారం అందడంతో వారు విజయవాడకు వచ్చి స్థానిక పోలీసుల సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఈ మాఫియా  ఎంత కాలం నంచి జురుగుతోందనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: