సామాజిక మాధ్యమాల్లో దుందుడుకుగా వ్యవహరించే వారికి ఇది మంచి వార్త కాదు.  మీ ఇష్టం వచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ఇక కుదరదు. గతంలో పాళీ చేతిలో ఉంది కదా అని పాత్రికేయులు ఇష్టం వచ్చినట్లు రాసిన సందర్భాలున్నాయి. ఇకపై అలాంటిది కుదరదు. ఎందుకో తెలుసా ?
సామాజిక మాధ్యమాల్లో విద్వేషం రిగిలించే విధంగా పోస్టులు పెడుతూ, విషం కక్కే  రాత గాళ్లుకు ఇక చీటి చిరిగిపో నుంది. స్థానికంగా నివాసం లేకపోయినా, ఎక్కడెక్కడో పరాయి రాష్ట్రాలలో, పొరుగు దేశాలలో నివాసం ఉంటూ సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిని పోస్టులు పెట్టే వారి పని పట్టేందుకు హైదరాబాద్ పోలీసులు సమాయత్తం అయ్యారు. వివిధ రాష్ట్రాలలోని పోలీసు విభాగలను సమన్వయం చేసుకుని విద్వేష పూరిత పోస్టులు పెట్టేవారి అంతు చూడాలని ప్రభుత్వం అదేశించింది. పోలీసులు వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని కఠినంగా వ్యవహరించ నున్నారు. ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, ఇతర ప్రముఖులను టార్కెట్ గా చేసుకుని, వారి వ్యక్తిగత జీవితాలను విమర్శిస్తూ పోస్టులు పెట్టే వారి పని పట్టాలని నిర్ణయించారు. కేసులు నమోదు చేయడంతో సరి పెట్టకుండా పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్మాయ స్థానాల్లో కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు అందాయి. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ ఆనంద్ తన శాఖ అధికారులు, సిబ్బందితో నిర్విహించిన సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారు స్థానికంగా లేరని కొందరు పోలీసులు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు.  విద్వేషాలు రగిల్చే విధంగా పోస్టులు పెట్టిన వారు విదేశాలలో ఉన్నా సరే చర్యలు తీసుకునేందుకు వెనుకాడవద్దని సూచించారు. ప్రవాస భారతీయులైనా (ఎన్.ఆర్ఐ), భారత దేశ పౌర సత్వం లేనివారయినా,  విదేశీ పౌరసత్వం ఉన్నవారైనా వెనుకాడ వద్దని సూచించారు. అవసరమైతే   కేసుల వివరాలను ఆయాదేశాల రాయభార కార్యాలయాకు పంపించాలని, విదేశీ పోలీసుల సహాయం అవసరమైతే తానే స్వయంగా  పర్మిషన్ లు లభించేలా చూస్తానని ప్రకటించారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖులపై ఒక్క నెలలో  డెబ్బైకి పైగా ఫిర్యాదులు వచ్చాయని, ఇకపై వీటిని ఉపేక్షించేది లేదని  ఆనంద్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: