అక్రమ సంబంధాలు అనేది రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ సంబంధాలే పచ్చని జీవితాలను పాడుచేస్తున్నాయి. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే ఇక్కడ అక్రమ సంబంధం ఫలితమే చివరికి అతని ప్రాణాలు తీసుకుంది. ట్రాక్టర్ తో బురదలో తొక్కి మరి కసిగా  తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగింది..  తెలుసుకుందాం..?
 సూర్యాపేట జిల్లా లోని హుజూర్నగర్ మండలం  లక్కవరం గ్రామానికి చెందిన మహేష్ అదే గ్రామానికి చెందినటువంటి నాగరాజు అనే రైతు భార్యతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ సంబంధం కాస్తా బయటపడడంతో వీరిరువురి మధ్య గొడవలు జరిగి పంచాయతీ కూడా పెట్టి సర్ది చెప్పారు. దీంతో నాగరాజు  మహేష్ పై పగ పెంచుకున్నాడు. ఎలాగైనా మహేష్ ను హతమార్చాలని అనుకున్నాడు. సమయం కోసం ఎదురు చూశాడు.


 అనుకున్నట్టుగానే సమయం వచ్చింది.  నాగరాజు మరియు మహేష్ ఇద్దరు కలిసి పొలం పనులకు వెళ్లారు. సాయంత్రం సమయంలో పనులు అయిపోయాక ఇద్దరు ఇంటికి బయలుదేరారు. అయితే నాగరాజు కూలీలను తీసుకొని ట్రాక్టర్ మీద ఇంటికి వచ్చాడు. మహేష్ తన టు వీలర్ బైక్ మీద ఇంటికి వస్తున్నాడు. అయితే నాగరాజు  కూలీలను తొందరగా గ్రామములో దింపి మళ్లీ వెనుకకు బయల్దేరాడు. చీకటి పడడంతో  ఎదురుగా వస్తున్నటువంటి మహేష్ ను తన ట్రాక్టర్ తో బలంగా ఢీ కొట్టాడు. వెంటనే మహేష్ ఎగిరిపోయి పొలంలో బైక్ తో సహా పడిపోయాడు. అయినా ఆగని నాగరాజు కసిగా ట్రాక్టర్ను మహేష్ పైకి ఎక్కించి బురదలో అటు ఇటు అంటూ చాలా తీవ్రంగా హతమార్చాడు. అది రాత్రి సమయం కావడంతో మహేష్ బురదలో కూరుకుపోవడంతో ఎవరికీ కనిపించలేదు. వెంటనే నాగరాజు గ్రామంలోకి వచ్చి ఏమీ తెలియనట్టు ఉన్నాడు. ఉదయం పూట పొలానికి వచ్చినటువంటి గ్రామస్తులు మహేష్ ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పాత పగతోనే నాగరాజు ఈ పని చేసి ఉంటారని భావించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: