ముఖ్యంగా సైబర్ మోసగాళ్లు బూస్టర్ డోస్ పేరుతో ప్రజలకు కాల్ చేస్తూ వారిని ప్రమాదలోకి నెట్టేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వాలు బూస్టర్ డోస్ వేయించుకోవాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోసగాళ్లు బూస్టర్ డోస్ పేరుతో ప్రజలకు కాల్ చేస్తూ ఉన్నారు. కాల్ చేసి బూస్టర్ డోస్ కోసం తమ పేరును నమోదు చేసుకోవాలని, మొబైల్‌కు వచ్చిన ఓటీపీ చెప్పాలని కాల్ చేసి అడుగుతున్నారు. అలా ఓటీపీ చెప్పిన కస్టమర్ల బ్యాంకు అకౌంట్లను నిమిషాల్లో ఖాళీ చేస్తూ ఉన్నారు సైబర్ మోసగాళ్లు.
కాల్ చేసిన తరువాత ముఖ్యంగా మీరు రెండు డోస్‌లు వ్యాక్సిన్ వేయించుకున్నారా..? అని అడుగుతున్నారు. మీరు యస్ అని చెబితే మోసగాళ్లు బూస్టర్ డోస్ వేయించుకున్నారా..? అని అడుగుతున్నారు ఆ తరువాత మేము మీ తరుపున బూస్టర్ డోస్ కోసం రిజిస్టర్ చేస్తున్నాం. మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది అని చెప్పాలని అడుగుతున్నారు. మీరు ఓటీపీ చెప్పిన వెంటనే మీ అకౌంట్‌లో ఉన్న డబ్బును వారు దొంగిలిస్తున్నారు.
మరొకవైపు దేశంలో కరోనా నూతన వేరియంట్ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,59,632 కేసులు నమోదు అయినట్టు ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. గత 224 రోజుల్లో అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 3,623 పెరిగినట్టు పేర్కొన్నది. కరోనా చికిత్స చేసుకుంటున్న రోగులు 5,90,611 కు పెరిగారు. 197 రోజుల్లో అత్యధికం. చివరగా 2020 మే 29న 1,65,553 కేసులు నమోదు అయ్యాయి.