ఇక్కడ ఇలాగే కొత్త ట్రెండ్ ఫాలో అవ్వాలి అని అనుకున్నారు పెళ్లి చేసుకోబోయే వధూవరులు. కానీ సీన్ రివర్స్ అయింది. భార్య డాన్స్ చేసిందని భర్త పెళ్లి లోనే విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన ఇరాక్ వెలుగులోకి వచ్చింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఓ యువకుడు అందమైన అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్దలు అందరూ కలిసి పురోహితుడు సూచన మేరకు ఒక ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే బంధుమిత్రులందరికీ కూడా పెళ్లికి ఆహ్వానించారు. అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక పెళ్లికి అంతా సిద్ధమైంది. వధూవరులు పెళ్లి మండపం లోకి రావడం ఒక్కటే ఆలస్యం.
ఈ క్రమంలోనే పెళ్లికూతురు కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతూ ఒక పాట పై డాన్స్ చేసింది. నీపై నేను ఆధిపత్యం చేలాయిస్తా.. నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి నేను అహంకారిని అంటూ అర్థం వచ్చే ఒక పాట పై డాన్స్ చేస్తుంది. ఇంకేముంది వరుడికి చిర్రెత్తి పోయింది. ఆ పాటతో మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ పేర్కొన్న వరుడు వివాహ వేదిక పైనే యువతికి విడాకులు ఇచ్చేశాడు. దీంతో అక్కడికి వచ్చిన బంధుమిత్రులు అందరూ కూడా ఒక్కసారిగా షాకయ్యారు. దేశంలోనే ఇది అత్యంత వేగవంతమైన విడాకుల కేసు అంటూ అక్కడి మీడియా కూడా వెల్లడించింది.