
ఇక్కడ ఇలాంటి ఒక విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ఎక్కడ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు సదరు వ్యక్తి. కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకుని వైరస్ బారి నుంచి కోలుకున్నాడు. హమ్మయ్య కరోనా వైరస్ నుంచి కోలుకుని ప్రాణాలతో బయటపడ్డా అంటూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలోనే ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే కంటి చూపు కూడా కోల్పోయాడు సదరు వ్యక్తి. దీంతో ఎంతగానో మనస్థాపం చెందిన సదరు వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.
ప్రేమవతి పెట్ కి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి భార్య శ్వేత కూతురు భవాని తో కలిసి నివసిస్తున్నాడు. ఇక వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు కార్మికుడు గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూన్నాడు. ఈ క్రమంలోనే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అనుకోని విధంగా 2020 లో కరోనా వైరస్ బారిన పడ్డాడు నవీన్ కుమార్.. ఇక ఆ తర్వాత చికిత్స తీసుకొని కోలుకున్నాడు. కానీ 2021 జూన్ లో బ్లాక్ ఫంగస్ బారిన పడ్డాడు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరికి ఆత్మస్థైర్యంతో బ్లాక్ ఫంగస్ బారి నుంచి కూడా కోలుకున్నాడు. కానీ బ్లాక్ ఫంగస్ బారిన పడిన తరువాత చివరికి కంటిచూపును కోల్పోయాడు. దీంతో విధులు సక్రమంగా నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నాడు. కుటుంబం పోషణ భారంగా మారిపోయింది. దీంతో ఎంతగానో మనస్థాపం చెందిన నవీన్ కుమార్ ఇటీవలే ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు నవీన్ కుమార్.