ఇటీవల కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అదే సమయంలో ఆడపిల్లలపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు కోర్టులు కఠిన శిక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం. అయినప్పటికీ ఎవరి తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అయితే ఇటీవలే మహిళలు ఒంటరిగా ప్రయాణించాలన్న కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే ఇటీవల రాజస్థాన్లోని ప్రతాప్ ఘడ్ జిల్లాలో పోలీసులు ఏకంగా మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడే ముఠా నూ అరెస్టు చేసారూ. ఇక ఈ ముఠాను విచారించగా ఎన్నో ఊహించని నిజాలు బయటపడ్డాయి. జాతీయ రహదారిపై ప్రయాణించే మహిళలను టార్గెట్ గా చేసుకుని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారాలకు పాల్పడుతూ కిరాతకంగా వ్యవహరిస్తూ ఉంటారు  అన్నది పోలీసుల విచారణలో తేలింది.


 ఈ క్రమంలోనే ఏకంగా ఐదుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు ఏకంగా వారి మొబైల్ లో ఉన్న కొన్ని అశ్లీల వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఏకంగా 15 రోజులకు ఒకసారి జాతీయ రహదారులపై ఇలాంటి నేరాలకు పాల్పడుతూ వస్తున్నారు అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఇక వీరందరూ కలిసి వరుసగా గ్యాంగ్ రేప్ లకు పాల్పడి నట్లు నిందితుల చరవాణి లో ఉన్న వీడియో లను చూస్తే అర్థమవుతుంది అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎనిమిది మందితో కూడిన ఈ ముఠా లో ఏకంగా ఎక్కువమంది 20 ఏళ్ల వయస్సు కలిగిన వారే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.


 చిన్న చిన్న బాలికలను కూడా వదిలిపెట్టకుండా కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారని పోలీసులు విచారణలో తేలిందని చెప్పుకొచ్చారు. ఇక ఎవరైనా దంపతులు కనిపించిన కూడా వ్యక్తిపై దాడి చేసి అతడి నుంచి భార్యను కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ సామూహిక అత్యాచారానికి  పాల్పడిన విషయాన్ని ఇక నిందితులు ఒప్పుకున్నారు అంటూ పోలీసులు తెలిపారు. ఇలా అత్యాచారం చేయడమే కాదు  ఈ దుశ్చర్యను  మొబైల్లో చిత్రీకరించడం లాంటివి చేసి.. ఈ విషయం పోలీసులకు చెప్తే వీడియోలు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు కూడా పాల్పడేవారిని అందుకే ఇప్పటివరకు ఈ విషయం బయటకు రాలేదు అంటూ పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: