ఇటీవలి కాలంలో ఎంతోమంది పిల్లలు క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నాయ్. పిల్లలు తమ ప్రపంచం  అంటూ బ్రతుకుతున్న ఎంతోమంది తల్లిదండ్రులకు పిల్లలు తీసుకున్న నిర్ణయాల కారణంగా కడుపుకోత మిగులుతుంది.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. తండ్రి లేడు తల్లి ఒక కుటుంబాన్ని పోషించుకుంటుంది. కానీ కొడుకును మాత్రం ప్రయోజకున్ని చేయాలి అనుకుంది ఆ తల్లి ఎన్ని కష్టాలొచ్చిన ఓర్చుకొని అయినా సరే పెద్ద పెద్ద చదువులు చదివించాలని అనుకుంది. ఇలాంటి సమయంలోనే కరోనా వైరస్ అనే మహమ్మారి వెలుగులోకి వచ్చి ఉపాధి లేకుండాపోయింది.


 అయినప్పటికీ ఏదో ఒక పని చేసుకుంటూ ఏకంగా ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ప్రైవేట్ కళాశాలలో చదివిస్తుంది ఆ తల్లి. ఇక తన కొడుకు బాగా చదువుకొని ప్రయోజకుడు అవుతాడు. మా జీవితాలు బాగుపడతాయి అంటూ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ చదువుకోడానికి వెళ్లిన ఆ విద్యార్థి మాత్రం యువతి ప్రేమలో పడిపోయాడు. ఇక తన మీదే ఆశలు పెట్టుకున్న తల్లి గురించి మర్చిపోయి యువతే జీవితం అనుకోవడం మొదలుపెట్టాడు. చివరికి యువతి ప్రేమ నిరాకరించడంతో తల్లి గురించి ఒక్క నిమిషమైనా ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు. దీంతో  విగతజీవిగా కనిపించిన కొడుకును చూసి గుండెలవిసేలా తల్లి ఏడుస్తు ఉండటం అందరిని కంటతడి పెట్టించింది.


 అనంతపురం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రోళ్ల మండలం జిజి గ్రామానికి చెందిన వరుణ్ యాదవ్ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. అయితే కూలి పనులకు పోయి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్న తల్లి అంజనమ్మ అతికష్టం మీద కుమారున్ని చదివిస్తోంది. అయితే రోజు కాలేజీకి వెళ్లి వచ్చే క్రమంలో ఓ యువతిని చూసి ప్రేమించడం మొదలు పెట్టాడు వరుణ్ యాదవ్. తొలిప్రేమ విషయం యువతికి చెప్పగా ఆ యువతి నిరాకరించింది. దీంతో కాలేజీకి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి మార్గమధ్యంలో ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా మారిపోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన ఎంతో మందిని కదిలిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: