డబ్బులను ఈజిగా సంపాదించుకుని ప్రయత్నంలో చాలా మంది అడ్డ దారులను తొక్కుతున్నారు.. కొందరు దొంగతనాలు చెస్తె మరికొంతమంది మాత్రం మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల ఎన్నో వెలుగు చుస్తున్నాయి. తాజాగా మరో ఘటన వెలుగు లోకి వచ్చింది. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి చీటీలు పేరుతో అందరినీ నమ్మించి చివరికి టోకరా వేశారు. వచ్చిన డబ్బులతో ప్లేట్ ఫిరాయించి రాత్రికి రాత్రే దుకాణం సర్దెసారు.. బోర్డు తిప్పెసారు.


వివరాల్లొకి వెళితే.. సాలెం జిల్లాలో ని వీరణం ప్రాంతాని కి చెందిన లలిత, తంగరాజన్ భార్యా భర్తలు. ఈ దంపతులు సాలెం లోని రాజగణపతి ఆలయం దగ్గర లలితాంబిక జువెలర్స్ అనే నగల దుకాణం ను గత కొన్నెల్లుగా నడుపుతున్నారు. అక్కడ కొత్త కొత్త మోడల్స్ ను ప్రజలకు అందించెవారు.అలా అందరి దగ్గర నమ్మించారు. దానితో పాటుగా చీటీలు వేసిన చాలామంది బంధువులకు కూడా చెప్పి వాళ్ల తో కూడా కట్టించారు. ఇంకేముంది.. ఈజీ మనీ కోసం పెద్ద స్కెచ్ వేసిన ఈ భార్యాభర్తల కోరిక త్వరగానే నేరవెరింది.


ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. చీటీలు వేసిన డబ్బులు 4 కోట్లు వచ్చింది. మూడు రోజులు నుంచి బంగారు దుకాణం తెరవక పోవడం తో అందరు ఇంటికి వెళ్లారు. అక్కడ తాళం వేసి ఉండటం తో బిత్తర పోయారు. అదే ఇంటి ముందు న్యాయం చేయాలంటూ బాధితులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గొడవ జరుగుతుందని తెలిసి పోలీసులు స్పాట్‌ కు చేరుకున్నారు. తంగరాజన్‌పై వచ్చిన ఆరోపణల పై పోలీసులు విచారణ జరిపారు. షాపులోని సీసీటీవీ ఫుటేజీ ని చూడగా వాళ్ళు అన్నీ సర్దుకున్నారు. ఇక మోస పొయామని గ్రహించిన వాళ్ళు పోలీసుల కు ఫిర్యాధు చేశారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తీ వివరాలను సెకరించె పని లో పడ్డారు..

మరింత సమాచారం తెలుసుకోండి: