సాధారణంగా మనుషుల మధ్య పగ ప్రతీకారాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక ఈ పగ ప్రతీకారాల తో  ఒకరినొకరు దారుణంగా హత్య చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. మనుషుల మధ్యే కాదు నాగు పాములు కూడా పగ బడుతూ ఉంటాయి అని వింటూ ఉంటాము. నాగు పాములకు హాని తలపెట్టిన వారిని గుర్తుంచుకొని మరీ పగబట్టి ప్రతీకారం తీర్చుకుంటాయి అని చెబుతూ ఉంటారూ. ఇక ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు నిజం అయ్యాయి కూడా.. ఇలా ఇప్పటివరకు పాములు పగ పడతాయ్ అన్నది విన్నాం కానీ కాకులు పగబెట్టడం  గురించి ఇప్పటి వరకు దాదాపు ఎవరూ విని ఉండరు.


 కానీ కాకులు కూడా పగబట్టి దారుణంగా దాడి చేస్తున్న ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మా మీద కాకులు పగపట్టాయి మమ్మల్ని కాపాడండి అంటూ కర్ణాటక ప్రజలు వాపోతున్నారు. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే అచ్చం నాగు పాముల లాగానే కాకులు కూడా ఎవరిమీదైనా  పగ పడితే వాళ్ళు ఎక్కడున్నా ప్రతీకారం తీర్చుకుంటాయి అన్నది ఇక్కడ జరిగిన ఘటనతో తెలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే. కర్ణాటక లోని చిత్రదుర్గం తాలూకా ఓబులాపురం గ్రామంలో ఒక కాకి గ్రామస్తులపై  పగబట్టింది.


 ఈ క్రమంలోనే ఎంతోమంది పై తరచూ దాడి చేయడం మొదలుపెట్టింది. దీంతో ప్రజలందరూ భయపడిపోతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలి అంటేనే వణికిపోతున్నారు. అయితే గ్రామస్తులు అందరినీ కాకుండా కేవలం గ్రామంలో ఉన్న కొందరిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆ కాకి దాడి చేస్తూ ఉండటం గమనార్హం. ఇలా కొంతమంది వ్యక్తులు ఎంత గుంపులో ఉన్నప్పటికీ కేవలం వారి పైన మాత్రమే దాడి చేస్తోందట. ముక్కుతో పొడవటం గోళ్ళతో రక్కటం లాంటివి చేస్తోందట. ఇప్పటివరకు ఏకంగా కాకి దాడిలో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తున్న గ్రామ ప్రజలు కాకి పగబట్టి ఇలా చేస్తుందని వాపోతున్నారు. ఆ కాకిని తరిమేందుకు ఎంత ప్రయత్నించినా అది ఊరు దాటి వెళ్లడం లేదని అంటున్నారు. ఈ విషయం తెలిసి రాజమౌళి సినిమాలో ఈగ పగ పట్టినట్లు గానే గత జన్మలో జరిగిందానికి కాకి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: