
కొందరు వ్యక్తులు జంతువులను అమితంగా ప్రేమిస్తారు. అంతేకాదు వాటి కోసం ప్రాణాలును కూడా లెక్క చెయ్యరు. వాటిని సొంత మనుషుల్లాగా చూసుకుంటారు. కానీ కొందరు మాత్రం వాటిపై రాక్షసత్వాన్ని చూపిస్తున్నారు. వీధి కుక్కలను అతి దారుణంగా కొట్టి చంపుతున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగు చూసింది.జంతువులపై దాడి చేసి పైశాచికానందం పొందుతున్నారు. ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అనేది చాలా మందిని బాధిస్తుంది.
అలాంటి మనుషులు కూడా ఉన్నారా అని సభ్యసమాజం తల దించుకుంటుంది. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి వీధిలో తన పాటికి అది పడుకొని వుంటే దానిని కారుతో గుద్దించి అతి దారునంగా చంపాడు. ఇది నిజంగా దారుణం అనే చెప్పాలి. వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ దారుణ సంఘటన గత బుధవారం రాష్ట్ర రాజధాని బెంగళూరు లోని రెసిడెన్షియల్ కాలనీలో చోటు చేసుకుంది.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న కుక్క పై తెలుపు రంగు ఆడి కారు తో వచ్చి వాటిని తొక్కించేసాడు..
ఇది ఇలా ఉండగా.. తన కారును వెనక్కి వెళ్లనిచ్చి ఒక్కసారిగా నిద్రిస్తున్న కుక్క పై ఉద్దేశ్యపూర్వకంగానే దూసుకెళ్లాడు. ఈ ఘటన మొత్తం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఘటన అనంతరం కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. అందులో ఒక కుక్కకు తీవ్ర గాయాలు కావడం తో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, ఆడి డ్రైవర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అనిమల్ లవర్స్ పోలీసుల ను, ప్రబుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు సత్వర చర్యలు చేపట్టారు. అతన్ని వీలైనంత త్వరగా అరెస్టు చేయాలి అని డిమాండ్ చెస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..