ఆడపిల్ల అర్ధరాత్రి నడిరోడ్డుపై భయం లేకుండా తిరిగినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్రం వచ్చింది అని గాంధీ గారు చెప్పారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ఇంకా దేశానికి అసలైన స్వాతంత్రం రాలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. అతను ఒక ఆటో డ్రైవర్ ఆటో నడుపుతూ జీవనం సాగించడం మానేసి.. కామంతో ఊగి పోయాడు.
అంతలో అతని కంట్లో ఒక బాలిక పడింది. చివరికి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ లోని టేకుమట్ల గ్రామంలో వెలుగులోకి వచ్చింది. రవి అనే వ్యక్తి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇక ఇటీవల బాలిక ఒంటరిగా కనిపించడంతో కామం తో ఊగిపోయాడు. అత్యాచారం చేయాలని ఇంట్లోకి లాక్కెళ్లాడు. అదేసమయంలో బాలిక తండ్రి గమనించాడు. దీంతో రవిని ప్రశ్నించగా.. బాలిక తండ్రి పై కర్రలతో దాడి చేశాడు రవి. ఇక అతడు చెర నుంచి తన కూతుర్ని రక్షించిన తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే ఇక బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.