ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక దారుణం చోటు చేసుకుంది.. మతం ముసుగులో ఒక సంస్థని నడుపుతూ.. ఆన్లైన్ ప్రార్థనలు పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన కొంతమంది మహిళలను, ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకొని వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ తెలిపిన ప్రకారం.. పాయకరావుపేట మండలంలో శ్రీరాంపురం లో ఈ సంఘటన వెలుగు చూసింది.. ఈ వ్యవహారం పై పోలీస్ కేసు నమోదు కావడంతో వారు ఈ కేసుపై దర్యాప్తు చేయడం జరిగింది. ఇక అందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శ్రీరాంపురం శివారులో ఏ.అనిల్ కుమార్ అనే వ్యక్తి ఒక భారీ భవనాన్ని నిర్మించి అందులో మత సంస్థ పేరుతో ఆశ్రమాన్ని నడుపుతున్నారట. ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నట్లుగా తెలియజేసి అక్కడ కూ వచ్చిన మహిళలను వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ అనిల్ కుమార్. అయితే అక్కడ వచ్చిన వారితో వెట్టిచాకిరీ చేయించుకోవడం తో పాటు.. వారిని లైంగికంగా కూడా వేధించే వాడట. ఇక అక్కడ తన పేరుని మార్చుకొని ప్రేమ దాస్ గా అక్కడ వారికి పరిచయమయ్యాడు. ఇక ఈ వ్యక్తి చేసే వేధింపులు భరించలేక తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక యువతి నిన్నటి రోజున పాయకరావుపేటలో  ఉండే పోలీసులను ఆశ్రయించడం జరిగింది.


ఇక ఆ యువతి తనకు ఇష్టం లేకుండా ఒక అబ్బాయితో బలవంతంగా వివాహం చేశారని.. ఇప్పుడు ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించారని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ సంస్థ నిర్వాహకుడు నీలిచిత్రాలను చూపిస్తూ అక్కడికి వచ్చే వారిపై లైంగికంగా వేధించే వాడని బాధితురాలు తన ఫిర్యాదులో తెలియజేసిందని సీఐ నారాయణ రావు తెలియజేయడం జరిగింది. ప్రార్థనల కోసం అనిల్ కుమార్ కు.. ఇతర ప్రాంతాల నుంచి కొన్ని లక్షల రూపాయలు చెల్లించినట్లు గా కొంతమంది మహిళలు మీడియా ముందుకు వచ్చి తెలియజేయడం జరిగింది.. కానీ ఎవరైనా ఎదిరిస్తే చంపేస్తామని బెదిరించేవాడట అనిల్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: