సినిమాల ప్రభావం జనాల పై ఎక్కువగా ఉంటుంది అనే ఒక టాక్ ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు పుష్ప సినిమా వచ్చిన తర్వాత మాత్రం ఇది నిజమే అన్నది అర్ధమవుతుంది. అయితే పుష్ప సినిమాలో ఏకంగా ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించే ఒక స్మగ్లర్ పాత్రలో నటిస్తాడు అల్లు అర్జున్. పోలీసులకు చిక్కకుండా సరికొత్త ప్లాన్ లు వేస్తూ ఎర్రచందనాన్ని తరలిస్తూ ఉంటాడు. దీని కోసం పాల ట్యాంకర్ కిందిభాగంలో ఎర్రచందనం దుంగలు ఉంచి పోలీసులకు అనుమానం రాకుండా పైన పాలు పోసి స్మగ్లింగ్ చేస్తాడు. పుష్ప సినిమా చూసిన వాళ్లకి దాదాపు ఈ విషయం తెలిసే ఉంటుంది.


 అయితే అచ్చం ఇలాగే పుష్ప సినిమాను చూసి బాగా ప్రభావితమైన ఎంతో మంది అక్రమార్కులు పోలీసుల కళ్లుగప్పి గంజాయి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ పోలీసులు కూడా పుష్పా సినిమా చూసే ఉంటారు కదా ఇక స్మగ్లర్లు వేసే సరికొత్త ప్లాన్ లను ఇట్టే కనిపెడుతు చివరికి మొత్తం సీజ్ చేస్తున్నారు. అచ్చంగా పుష్ప సినిమాలో లాగానే ట్యాంకర్ కింద భాగంలో అరల ఏర్పాటు చేసి గంజాయి స్మగ్లింగ్ చేయాలనుకున్నా అక్రమార్కులను ఇటీవలే పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 అరకు నుంచి ఎస్.కోట వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్ లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని సమాచారం అందుకున్నారు పోలీసులు. దీంతో సిబ్బందితో కలిసి చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఆయిల్ ట్యాంకర్ అక్కడికి చేరుకుంది. ఇక అందులో కేవలం ఆయిల్ మాత్రమే ఉందని గంజాయి లేదు అంటూ డ్రైవర్ క్లీనర్ మాయమాటలతో నమ్మించేందుకు ప్రయత్నించినా కుదరలేదు. చివరికి పోలీసులు  చెక్ చేయగా ఇక ఆ ట్యాంకర్ లో గంజాయి ఉంది. ఏకంగా 780 కిలోల 149 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 30 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  కాగా పరారైన  నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: