అయితే చేతబడి చేస్తున్నారనే నేపథ్యంలో భార్య భర్తలు స్తంభానికి కట్టేసి.. అందరూ చూస్తుండగానే విపరీతంగా కొట్టారు. ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడే ఉన్న స్థానికులు మాత్రం అడ్డు చెప్పకుండా విచిత్రం చూస్తున్నట్లు చూస్తూ ఉండిపోయారు. అసలు విషయం ఏంటంటే.. దంపతులు నిత్యం కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటే బాణామతి చేస్తున్నారని ఆరోపిస్తూ సమీప బంధువులు దాడికి దిగారు.
ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని దంపతులను రక్షించారు. వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో స్థానికంగా కలకలంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మంత్రాల పేరుతో ఏదో ఒక గ్రామంలో తరుచుగా గొడవలు అవుతూనే ఉన్నాయి.
కాగా.. ఆ పోలీసులు ఆయా ప్రాంతాల్లో మంత్రాల నెపంతో జరుగుతున్న వాటి పై అవగాహన కల్పించినా... గ్రామంలో మాత్రం చేతబడి చేస్తామంటూ, మంత్రాలు వస్తాయంటూ పలువురు రహస్యంగా వెల్లడించారు. కానీ పోలీసులు మాత్రం ప్రజలకు మూఢనమ్మకాలపై అవగహన కల్పిస్తున్నారు. ఇక నమ్మవద్దని, జ్వరం లాంటివి వచ్చినా హాస్పిటల్ కి వెళ్లాలి తప్ప మంత్రాలు, తాయత్తులు అంటూ తిరగవద్దని వెల్లడించారు. అంతేకాక.. మూఢనమ్మకాలను నమ్మవద్దని నిపుణులు శాస్త్రీయపరంగా వెల్లడిస్తున్నారు.