
ఇలా ఇటీవలికాలంలో పాఠశాలలు కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించినప్పుడు ఎక్కడ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం శ్రీధర్ గట్ట ఉన్నత పాఠశాలలో ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిజికల్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి విద్యార్థునులను నివేదించిన ఘటన మరువక ముందే మరో దారుణం వెలుగుచూసింది పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏకంగా ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థునులను విధించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థునులు డయాల్ 100 కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే ఇటీవలే కొన్ని సంఘాలకు నాయకుడిగా ఉండి ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల ఎవరో తప్పుడు ఆరోపణలు చేశారని బుకాస్తున్నాడు సదరు ఉపాధ్యాయుడు.. అయితే గతంలో విద్యార్థుల పట్ల వక్ర బుద్ధి చూపించి లైంగిక వేధింపులకు పాల్పడినప్పటికి అతని తీరు మాత్రం మార్పు రాలేదు. ఇటీవలే మరోసారి అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.