ప్రభుత్వ పథకాలను  ప్రజలందరికీ చేరువ చేసేందుకు గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలు ప్రజలకు చేరే విధంగా వాలంటీర్లు తక్కువ జీతంతో పని చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను తీర్చడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఇలా కష్టాలు ఉన్నప్పటికీ తమ విధి నిర్వహణ  కర్తవ్యంగా భావిస్తూ సాయశక్తులా కృషి చేస్తున్న వాలంటీర్లను ఇప్పటి వరకు చూశాం. కానీ కొంత మంది వాలంటీర్లు మాత్రం ప్రజలకు సేవ చేయడం కాదు ప్రజలను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని తెలుస్తోంది.



 ఎంతో బాధ్యతగా మెలగాల్సిన వాలంటీర్లు ఇటీవలికాలంలో ప్రజలను మోసం చేస్తూ చివరికి పోలీసులకు పట్టుబడిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఉన్న ఉద్యోగం చేసుకోకుండా అత్యాశకు పోతే ఏమవుతుంది అన్నది మాత్రం ఇక్కడ మరో సారి రుజువైంది.. గ్రామ వాలంటీర్ చేయాల్సిన పనులు మానేసి చిట్టీల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టింది. ఇలా దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. కానీ ఆ తర్వాత మాత్రం డబ్బు  మొత్తంతో పరార్ అయింది ఆ గ్రామ వాలంటీర్. విజయనగరం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.



 విజయనగరం సాలూరు లోని చిట్లు వీధికి చెందిన రమ్య వార్డు వాలంటీర్ గా పనిచేస్తుంది  గత కొన్ని ఏళ్లుగా తల్లి అరుణ తో కలిసి ఉంటున్న రమ్య ఇటీవలే పొదుపు చిట్టీల వ్యాపారం మొదలు పెట్టింది. మాయమాటలతో చుట్టుపక్కల వారందరికీ కూడా వీరిపై నమ్మకం వచ్చేలా చేసింది. దీంతో ఎంతో మంది ఇక రమ్య దగ్గర చిట్టీలు వేయడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత వీరి అసలు రంగు బయటపడింది. ఇక ఇలా చుట్టుపక్కల వారి నుంచి చిట్టీలు అంటూ చెప్పి మూడు కోట్ల వరకు వసూలు చేసి చివరికి వాటితో పరారయ్యారు తల్లి కూతుర్లు.. ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: