ఆడవాళ్ళు అర్దరాత్రి బయటకు వచ్చిన రోజే మన దేశానికి నిజమైన స్వతంత్రం అని గాంధీ ఎప్పుడో చెప్పాడు.. అలాంటి రోజు ఒకటి వస్తుందా అనే సందెహాలు కలగడం సహజం. అర్ద రాత్రి మాట పక్కన పెడితే ఇప్పుడు పట్టపగలు కూడా బయటకు వెళ్ళాలంటే భయంతో వణికిపోతూన్నారు. ఎవరూ ఎక్కడ వారి జీవితాన్ని నాశనం చెస్తారొ అని.. కానీ కొంత మంది అమ్మాయిలు కొన్ని చిన్న చిన్న కారణంవల్ల తల్లి దండ్రుల పై అలిగి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అది గమనించిన కొందరు వ్యక్తులు అమ్మాయికి మాయ మాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 



అనంతరం బాలిక ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని భయపెట్టారు. అమ్మాయి అలా పడి ఉండటం గమనించిన కొందరు అమ్మాయిని దగ్గర లోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాల్లొకి వెళితే.. బంగారుపేట తాలూకాలో ఈ దారుణం ఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ళ బాలిక అలిగి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. తన పుట్టిన రోజు నాడు కూడా కొత్త డ్రెస్ కొనివ్వలేదని అలిగి ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. అదే ఆమె చేసిన నేరం అని చెప్పాలి. 



అలా బయటకు వచ్చిన యువతి.. ఆటోలో బంగారు పేటకు చేరుకుంది. బస్టాండ్‌ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని కొందరు గమనించారు. ఆనంద్‌కుమార్, కాంతరాజు, ప్రవీణ్, వేణు అనే యువకులు బాలికకు పని ఇప్పిస్తామని నమ్మించి కామసముద్రం ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపెస్తామని బెదిరించి అక్కడ నుంచి పారిపొయారు.. అటుగా వెళ్తున్న కొందరు బాలిక పరిస్థితిని చూసి బంగారుపేట ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొన్ని గంటల సమయం లోనే నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి పోక్సో కేసు నమోదు చేశారు..


మరింత సమాచారం తెలుసుకోండి: