ఈ భయానకమైన ఘటన అగ్ర దేశమైన అమెరికా లో వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్ కౌంటీలో జాన్ బుర్కే, మెలవిన్ వెల్లర్ భార్య భర్తలు ఉన్నారు. కాగా భర్త మెల్విన్ దివ్యాంగుడు.. అయితే ఇటీవల ఏం జరిగిందో తెలియదు గానీ.. భార్య తన భర్తను మాంసం కోసే కత్తితో పొడిచింది. 140 సార్లు కత్తితో పొడిచింది. అంతే కాదు భర్త కపాలాన్ని రెండు ముక్కలుగా చేసింది. అయితే ఇది గమనించిన 41 ఏళ్ల కుమారుడు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ జరిగిన ఘటన చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఈ క్రమంలోనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టంలో మొత్తంగా శరీరంపై 140 కత్తిపోట్లు ఉన్నాయి అన్న విషయం తేలింది. అంతేకాకుండా మృతుడి కపాలం బాగా ఛిద్రమై పోయింది అన్న విషయం కూడా పోస్టుమార్టంలో తేలింది. పోస్టుమార్టంలో బయటకు వచ్చిన నిజాలతో డాక్టర్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా భర్తను దారుణంగా హతమార్చిన భార్య ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు గల కారణాలు ఏంటి అన్న దానిపై విచారణ ప్రారంభించారు..