కానీ అంతలోనే మరో రోడ్డు ప్రమాదం.. దీంతో చివరికి ప్రాణాలు పోయాయి. ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చిం ఈ ఘటన. ది ఓ యువకుడిని మృత్యువు వెంటాడింది. ట్రక్ డ్రైవర్గా పనిచేస్తున్న యువకుడిని తొలుత ఒక ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి గాయాలు అయ్యాయి. ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకొని మళ్ళీ ట్రక్ లో భోజనం చేస్తున్నాడు. ఇక అంతలోనే వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు ఈ ఘటనతో స్థానికులు సైతం ఒక్కసారిగా షాక్ అయి పోయారు అని చెప్పాలి.
కర్నూలు జిల్లా సున్నిపెంట కు చెందిన ఉమర్ ఇటీవలే మధ్యాహ్నం శ్రీశైలం నుంచి ట్రక్కు నడుపుకుంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం వస్తున్నాడు. ఈ క్రమంలోనే పెద్దరవీడు సమీపంలోకి రాగానే ఆర్టిసి బస్సు ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్ ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. సదరు యువకుడు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు సదరు యువకుడు. దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లి ఇక దెబ్బలకు కట్టు కట్టించుకున్నాడు. ఆ తర్వాత అదే ట్రక్కులో యజమాని తో కలిసి ఉమర్ భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో మార్కాపురం నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందగా యజమాని మల్లికార్జున కు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.