అతను ఒక కమ్యూనిటీ పోలీస్  ఎప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.. అయితే పోలీసులంటే కఠినంగానే ఉంటారు అని అనుకుంటూ వుంటారు చాలామంది. కానీ ఇక్కడ కమ్యూనిటీ పోలీసుకు  మాత్రం ఖాకీ చొక్కా వెనకాల దాగి ఉన్న మనసులో ప్రేమ పుట్టింది. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. ఇక ఎవరికీ తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. పెద్దలు మాత్రం వీరి పెళ్లికి అస్సలు ఒప్పుకోలేదు. దీంతో అప్పటివరకూ ప్రేమించిన యువతి గురించి కాస్తయినా ఆలోచించకుండా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు సదరు వ్యక్తి.



 దీంతో ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడు అని షాక్ అయిన యువతి చివరికి భర్త ఇంటిముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం లో వెలుగులోకి వచ్చింది. చెన్నైకి చెందిన శ్రీదేవి అనే యువతి సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తూ ఉంటుంది. బీసీ కాలనీకి చెందిన రామచంద్రన్ కమ్యూనిటీ పోలీస్ గా ఉంటూ ఇంజనీరింగ్ కాలేజీలో బస్సు డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇక ఇద్దరూ ఒకే కాలేజీలో పని చేయడంతో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇక అంతలోనే రామచంద్రన్ కు హోంగార్డు గా ఎంపికయ్యాడు.


 ఇక ఇటీవలే రామచంద్రన్ శ్రీదేవి ఇంట్లో ఎవరికీ తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తిరుపతి లో కాపురం పెట్టారు. ఇక చివరికి ఈ విషయం రామచంద్రన్ తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఇక అతన్ని ఇంటికి తీసుకు వెళ్లారు. ఇక పెద్దలను ఒప్పించి ఇంటికి తీసుకెళ్తాను అంటూ వెళ్తూ వెళ్తూ శ్రీదేవి కి చెప్పి వెళ్ళాడు రామచంద్రన్. ఇక చివరికి రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి రావడంతో ఒక ఉమెన్స్ హాస్టల్ లో చేరింది శ్రీదేవి. కానీ భర్త నుంచి  మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఇక ఇటీవలే భర్త వేరే పెళ్ళికి సిద్ధమయ్యాడు అన్న విషయం తెలుసుకుంది శ్రీదేవి. దీంతో  దీక్ష భర్త ఇంటిముందు చేపట్టింది. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని శ్రీదేవి కి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: