ఈ మధ్యకాలంలో టాటూ వేయించుకోవడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన టాటూ వేయించుకోవడంకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా టాటూ వేయించుకోవడం నేటి రోజుల్లో ట్రెండ్ అంటూ ఫీల్ అవుతున్నారు. ఇక కొంతమంది అయితే చిత్రవిచిత్రంగా వేయించుకో కూడని చోట కూడా టాటూ వేయించుకుంటూ ఉండటం గమనార్హం.  ఇక ఇలా టాటూ వేయించుకోవడం ఇక్కడ ఏకంగా 7 గురు యువతుల పాలిట శాపంగా మారిపోయింది.



 ఎందుకంటే టాటూ వేయించుకోవడానికి వెళ్లిన యువతులను లోబర్చుకుని చివరికి అత్యాచారానికి పాల్పడ్డాడుఒక వ్యక్తి.   ఈ ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. సుజీష్ అనే వ్యక్తి టాటూలు వేసే ఒక స్టూడియో నడుపుతున్నాడు. ఇక ఇటీవల ఒక ఒక 18 ఏళ్ల యువతి టాటూ వేయించుకోవడం కి అతని స్టూడియో కి వెళ్ళింది. అయితే టాటూ వేసే నెపంతో సుజీష్ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఇక ఈ విషయాన్ని యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేసింది యువతీ. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సుజీష్ పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. ఇక దర్యాప్తులో భాగంగా ఊహించని నిజాలు బయటపడ్డాయి.


 అయితే మొత్తంగా మరో ఆరుగురు మహిళలపై కూడా సురేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు అన్న విషయం బయటపడింది. ఇక ఈ తతంగం మొత్తం బయటపడటంతో పోలీసుల నుంచి తప్పించుకుని పరారయ్యాడు ఆ వ్యక్తి. ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక ఇటీవలే లాయర్ను కలవడానికి వస్తున్న సమయంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే పదేళ్లుగా అతను టాటూ స్టూడియో నిర్వహిస్తున్నాడని టాటూ వేయించుకోవడం బహిరంగంగానే జరిగిందని ఎవరిని లైంగికంగా వేధించలేదు అంటూ కుటుంబసభ్యులు స్నేహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: