ఇలా ప్రయత్నించే క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు విద్యార్థులకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. కాపీ కొట్టినప్పుడు ఇక ఇన్విజిలేటర్ కి దొరికారు అంటే చివరికి డీబార్ అవ్వడం ఖాయం అన్న విషయం తెలిసిందే. మరోసారి పరీక్ష రాసేందుకు కూడా అనుమతి ఉండదు.. ఇవన్నీ తెలిసినా కూడా కొంత మంది విద్యార్థులు కాస్త ఎక్కువగానే రిస్కు చేస్తూ ఉంటారు. పట్టుబడిన తర్వాత కాళ్లావేళ్లా పడుతూ బ్రతిమిలాడడం చేస్తూ ఉంటారు. అయితే ఇక ఇలా కాపీ కొడుతూ పట్టుబడడమే ఇక యువతి పాలిట శాపంగా మారి పోయింది. చివరికి బలవన్మరణానికి పాల్పడిన ప్రాణాలు తీసుకుంది విద్యార్థిని.
బెంగుళూరులోని జీవన బీమా నగర్ లు భవ్య ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ జ్యోతి నివాస్ కాలేజీలో బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతుంది. వాయిదా పడుతూ వచ్చిన పరీక్షను గత వారం నిర్వహించారు. ఈ క్రమంలోనే కాపీ స్లిప్పుల ను బయటకు తీసిన భవ్య ఇక దొంగచాటుగా రాయడం మొదలుపెట్టింది. ఇక అనుమానం రావడంతో ఇన్విజిలేటర్ పరిశీలించగా కాఫీ స్లిప్పులు దొరికిపోయాయ్. ఇంకోసారి చేయను సార్ ప్లీజ్ వదిలేయండి కెరీర్ నాశనం అవుతుంది అంటూ ఎంతగానో ప్రాధేయపడింది భవ్య. అయినప్పటికీ పట్టించుకోకుండా యువతిని డీబార్ చేశారు అధికారులు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయింది. ఇంటికి ఫోన్ చేసి కాపీ కొడుతూ దొరికిపోయా డీబార్ చేశారు బ్రతకాలని లేదు అంటూ ఫోన్ పెట్టేసింది. తల్లిదండ్రులు హాస్టల్ దగ్గరకి వచ్చి చూడగా చివరికి అప్పటికే ఉరివేసుకొని ప్రాణాలు వదిలింది బాలిక. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..