రోడ్డుపై ఉండే ఆకతాయిలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నేటి రోజుల్లో పక్కన ఎవరైనా కావాల్సిన వారు.. కుటుంబ సభ్యులు.. ఉంటే ఎంతో భరోసాగా ధైర్యంగా ఉంటాను ఆడపిల్లలు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఎవరైనా పక్కన ఉంటే తమకు ఎలాంటి ఆపద ఉండదు అని భావిస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో మాత్రం రెచ్చిపోతున్న కామాంధులు పక్కన ఎవరైనా ఉన్న సరే పట్టించుకోవడం లేదు. లేదంటే పక్కన ఉన్న కుటుంబ సభ్యులపై దాడి చేసి మరి ఆడపిల్లలపై అత్యాచారాలు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిషింగ్ హార్బర్ చూసేందుకు వెళ్లిన ఒక ప్రేమజంటపై దాడి చేసిన కామందులు ఏకంగా ప్రియుడిని తాళ్లతో కట్టేసి అతని కళ్ల ముందే  యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని బందరులో వెలుగులోకి వచ్చింది. ఇక విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు బందరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే లైంగిక దాడికి పాల్పడ్డ నాగబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే మచిలీపట్నంలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటన సంచలనం గా మారిపోయింది.


 ఇటీవలే ఓ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి బీచ్ కి వెళ్ళింది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వారి వద్దకు ఇద్దరు మందుబాబులు వచ్చారు. ఇక మొదట ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రియుడిని తాళ్లతో చెట్టుకు కట్టేశారు. ఇక విద్యార్థినిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ ప్రేమజంట సైలెంట్ గానే ఉండిపోయింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఎంతో బాధ పడిపోతున్న కూతుర్ని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలోనే బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగబాబు అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: