అతివేగం మొదట కిక్ ఇచ్చిన.. ఆ తర్వాత మాత్రం ప్రాణాలను గాల్లో కలిపేస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకో ఇటీవలి కాలం లో అతి వేగంగా వెళ్లడానికి అందరూ ఇష్ట పడుతున్నారు. చివరికి రోడ్డు ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఇటీవలికాలంలో అతివేగం రోడ్డు నిబంధనలు పాటించక పోవడం వెరసి ఎన్నో ప్రమాదాలు ప్రమాదాలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఇటీవలే 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ హైదరాబాద్  రహదారిపై కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది.


 ఇందులో ఒక చిన్నారి సహా ఏకంగా నలుగురు మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు చెబుతున్నారు వివరాల ప్రకారం.. జగ్గయ్యపేట మండలం గౌరవరం సమీపంలో సమీపంలో సాగర్ కెనాల్ వద్ద వేగంగా దూసుకు వచ్చిన ఒక కారు అదుపుతప్పి కల్వర్టును  ఢీకొట్టింది. అయితే ఇక ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు  ప్రయాణిస్తూ ఉండటం గమనార్హం. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.


 ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మొబైల్ టీమ్, నేషనల్ హైవే టీం ప్రమాదంలో గాయపడిన చిన్నారిని  మరో ఇద్దరిని జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. అతివేగం కారణంగానే ఈ ఘటన జరిగిందని నిర్ధారించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇక మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: