ఇటీవల కాలంలో ప్రాణాలకు విలువ ఇవ్వకుండా చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య ఎక్కువైపోతుంది. చిన్న సమస్య వస్తే చాలు జీవితం ముగిసి పోయింది అని భావిస్తూ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి దేవుడిచ్చిన ప్రాణాలను అర్ధాంతరంగా చేజేతులారా తీసుకుంటున్నారు మనుషులు. క్షణికావేశంలో   తీసుకున్న నిర్ణయాల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండిపోతుంది. ఇక ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. జానపద నేపథ్య గాయకుడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సింగర్ చివరికి బలవన్మరణానికి పాల్పడ్డాడు.



 దీంతో ఇక ఎంతోమంది అభిమానులను తన దాదాపు జాన పదాలతో  ఉర్రూతలూగించిన గానం ఇక వినిపించదు అని తెలిసి అభిమానులు అందరూ కూడా దిగ్భ్రాంతికి గురి అవుతున్నారు. వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం పిల్లిగుండ్ల తండ కు చెందిన జటావత్ మోహన్ బంజారా పాటలు పడుతూ ఉండేవాడు. అంతేకాదు జానపద పాటలు కూడా పాడి ఎంతో మందిని ఉర్రూతలూగించే వాడు. అయితే గత కొంత కాలంగా హైదరాబాద్లోని చంపాపేట్ లో నివాసం ఉంటున్నాడు జటావత్ మోహన్. అయితే ఇటీవలే అర్ధరాత్రి సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం సమయంలో ఎంతకీ తలుపు తీయకపోవడంతో గమనించిన స్థానికులు ఉరివేసుకున్నాడు అని తెలిసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.


 ఈ సంఘటన స్థలానికి శరవేగంగా చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఇక మోహన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే మోహన్ మృతికి గల కారణాలు ఏంటి అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇక జటావత్ మోహన్ మృతితో ఆయన స్వగ్రామం లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేపడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: